TDP Leaders Angry with Police for not Arresting MLA Pinnelli:ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ మొత్తం పోలీసు వ్యవస్థకే సిగ్గుచేటని టీడీపీ నేతలు విమర్శించారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని పోలీసులను ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారని మండిపడ్డారు.
Kanakamedala Ravindra Kumar:రాష్ట్రంలో పోలింగ్ రోజు జరిగిన ఘటనల వీడియోలను బయటపెట్టాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. మాచర్ల ఘటనల నేపథ్యంలో ఓట్ల లెక్కింపు రోజు భద్రత కట్టుదిట్టం చేయాలని కోరారు. ఎక్కువ మంది పోలీసులు ఇప్పటికీ వైసీపీకి తొత్తులుగా ఉన్నారని మండిపడ్డారు. పోలీసుల సహకారంతోనే పిన్నెల్లి తప్పించుకున్నారని అన్నారు. ఘటనకు బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కనకమేడల కోరారు.
అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేశాం- బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వేధిస్తోంది: కాంట్రాక్టర్లు - Water Supply Contractors Meeting
GV Anjaneyulu:పోలీసులు ఎవరి అధీనంలో పనిచేస్తున్నారో ఈసీ చెప్పాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఈవీఎంను ధ్వంసం చేసిన రౌడీని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న వెంటనే పిన్నెల్లిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. అరెస్టు యత్నాలకు ముందు రోజే పిన్నెల్లి ఇంటర్వ్యూలు ఇచ్చారని అన్నారు. కావాలనే పిన్నెల్లిని తప్పించి ఈసీ ముందు దొంగ నాటకాలు ఎందుకు పోలీసులను ప్రశ్నించారు. సీఎంవో డైరెక్షన్ మేరకే పిన్నెల్లి పరారీ డ్రామా రక్తి కట్టిస్తున్నారని అన్నారు.
Prathipati Pullarao:పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారీ రాష్ట్ర పోలీసుల అసమర్థతకు నిదర్శనమని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించినా అరెస్టు చేయకుండా ఎవరి కళ్లకు గంతలు కడుతున్నారని మండిపడ్డారు. జరుగుతున్నవి చూస్తుంటే పిన్నెల్లిని పోలీసులే విహారయాత్రకు పంపినట్లుందని దుయ్యబట్టారు. ఈసీ ఇకనైనా పోలీసుల నిజస్వరూపం తెలుసుకోవాలని కోరారు.
ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలి- అప్పటివరకూ మూడంచెల భద్రత : సీఈఓ - CEO Instructions to Officers
Julakanti Brahma Reddy:ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా పిన్నెల్లి పారిపోవటానికి సజ్జల వంటి ప్రభుత్వ పెద్దలతోపాటు కొందరు పోలీసు అధికారులు సహకరించారని మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. గంటలో మాచర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు.
Buddha Venkanna:వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ తురకా కిషోర్లను పోలీసులు ఏం చేసినా తప్పు లేదని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధ్వజమెత్తారు. మాచర్లలో తురకా కిషోర్ తమపై దాడి చేశారని గుర్తు చేశారు. టీడీపీ వాళ్లపై దాడి చేస్తే ఛైర్మన్ పదవి ఇస్తానని పిన్నెల్లి వేలం పాట పెట్టారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పులిరా పులిరా పెద్ద పులిరా, ఈవీఎంలు పగలగొట్టి పిల్లిలా పారిపోయేరా' - పిన్నెల్లిపై నెట్టింట్లో ట్రోల్స్ - Social Media Trolls on Pinnelli
Alliance Candidate Nallamilli Ramakrishna:మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నల్లి ప్రవర్తించిన తీరుపై అనపర్తి ఎన్డీఏ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యుడు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎం పగలగొట్టడం రాష్ట్రంలో శాంతిభద్రతలకు అద్దం పడుతుందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అనేకచోట్ల కొన్ని ఘటనలు జరిగాయని ముఖ్యంగా గొల్లల మామిడాడలో 196, 197, 198 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు.
TDP state spokesperson Syed Rafi:వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రక్షణ లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ధ్వజమెత్తారు. మాచర్లలో ఆరుగురిని హతమార్చారని మండిపడ్డారు. 79 మందిపై దాడులకు తెగబడగా అందులో 51 మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలేనని తెలిపారు. జగన్ రెడ్డి పాలనలో పిన్నెల్లి హింసకు, రక్తపాతానికి అడ్డులేకుండా పోయిందని దుయ్యబట్టారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై కేసు నమోదు చేయకుండా పోలీసులే తప్పించడం సిగ్గుచేటని విమర్శించారు.