BC SC ST leaders Names in TDP first list:తెలుగుదేశం ప్రకటించిన 94మంది అభ్యర్థుల తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్రంలో మొత్తం 7ఎస్టీ అసెంబ్లీ స్థానాలతో పాటు 27ఎస్సీ స్థానాలు ఉండగా, మొత్తం 34స్థానాలకు గానూ సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. 20మంది ఎస్సీ అభ్యర్థుల్ని, ముగ్గురు ఎస్టీ అభ్యర్థులు కలిపి మొత్తం 23మందిని తొలి జాబితాలో ప్రకటించటం విశేషం. ఇక పార్టీకి వెన్నుదన్నుగా భావించే బీసీలకు సంబంధించి తొలిజాబితాలో 17మందికి చోటు కల్పించారు. తెలుగుదేశం ప్రకటించిన తొలిజాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల సంఖ్య 41గా ఉంది. ప్రకటించిన తొలి జాబితాలో దాదాపు 44శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే ఉండటం విశేషం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
టీడీపీ తొలి జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం - Jana Sena first list
BC SC ST leaders Names in TDP first list: 99 అభ్యర్థులతో కూడిన తెలుగుదేశం-జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. అందులో టీడీపీకి చెందిన 94 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ తొలిజాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థుల సంఖ్య 41గా ఉంది. ఈ జాబితాలో దాదాపు 44శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల పేర్లను ప్రకటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 5:21 PM IST
(బీసీలు)
1. బెందాలం అశోక్ - ఇచ్చాపురం(బీసీ)
2. టెక్కలి - అచ్చెన్నాయుడు (బీసీ)
3. కూన రవికుమార్- ఆముదాల వలస (బీసీ)
4. కొండపల్లి శ్రీనివాస్ - గజపతినగరం (బీసీ)
5. గణబాబు- విశాఖ పశ్చిమ (బీసీ)
6. అయ్యన్న పాత్రుడు - నర్సీపట్నం (బీసీ)
7.యనమల దివ్య - తుని (బీసీ)
8. ఆదిరెడ్డి వాసు - రాజమండ్రి అర్బన్ (బీసీ)
9. పితాని సత్యనారాయణ- ఆచంట (బీసీ)
10. కొలుసు పార్థసారధి - నూజివీడు (బీసీ)
11. కాగిత కృష్ణ ప్రసాద్ - పెడన (బీసీ)
12. కొల్లు రవీంద్ర- మచిలీపట్నం (బీసీ)
13. అనగాని సత్యప్రసాద్ - రేపల్లె (బీసీ)
14.పుట్టా సుధాకర్ యాదవ్ - మైదకూరు (బీసీ)
15. కేఈ శ్యామ్ బాబు - పత్తికొండ (బీసీ)
16. కాలవ శ్రీనివాసులు - రాయదుర్గం (బీసీ)
17. సవిత - పెనుగొండ (బీసీ)
(ఎస్సీలు)
18. కొండ్రు మురళి - రాజాం (ఎస్సీ)
19. బోనెల విజయ్ - పార్వతీపురం (ఎస్సీ)
20. వంగలపూడి అనిత - పాయకరావు పేట (ఎస్సీ)
21. మహాసేన రాజేష్ - పి.గన్నవరం (ఎస్సీ)
22. సొంగా రోషన్ - చింతలపూడి (ఎస్సీ)
23. కొలికలపూడి శ్రీనివాస్ - తిరువూరు (ఎస్సీ)
24. వర్ల కుమార్ రాజా- పామర్రు (ఎస్సీ)
25. తంగిరాల సౌమ్య - నందిగామ (ఎస్సీ)
26. తెనాలి శ్రావణ్ కుమార్ - తాడికొండ (ఎస్సీ)
27. నక్కా ఆనంద్ బాబు - వేమూరు (ఎస్సీ)
28. బూర్ల రామాంజనేయులు - పత్తిపాడు (ఎస్సీ)
29. గూడూరు ఎరిక్షన్ బాబు - ఎర్రగొండపాలెం (ఎస్సీ)
30. విజడోలాయ్ కుమార్ - సంతనూతుల పాడు (ఎస్సీ)
31. డోలా బాలవీరాంజనేయ స్వామి- కొండెపి (ఎస్సీ)
32. పాశెం సునీల్ కుమార్ - గూడూరు (ఎస్సీ)
33. నెలవల విజయ్ శ్రీ - సూళ్లూరుపేట (ఎస్సీ)
34. బొగ్గుల దస్తగిరి - కోడుమూరు (ఎస్సీ)
35. బండారు శ్రావణి - సింగనమల (ఎస్సీ)
36. ఎం.ఈ.సునీల్ కుమార్- మడక శిర (ఎస్సీ)
37. వీ.ఎం.థామస్ - జీడీ నెల్లూరు (ఎస్సీ)
(ఎస్టీలు)
38. తోయక జగదీశ్వరి - కురుపాం (ఎస్టీ)
39. గుమ్మడి సంధ్యారాణి - సాలూరు (ఎస్టీ)
40. దొన్ను దొర - అరకు (ఎస్టీ)
(మైనార్టీ)
41. ఎన్ ఎండీ ఫరూఖ్ - నంద్యాల