ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ జిల్లాలో విజృంభిస్తున్న మాయరోగం! రోజురోజుకు పెరుగుతున్న బాధితుల సంఖ్య - TB Cases Anantapur

TB Cases Increasing Alarming in Anantapur District : పోషకాహార లోపమో లేక మరే ఇతర కారణాలో కానీ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ మాయదారి రోగం భారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పేదలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతోంది. అసలు ఈ వ్యాధి ఏంటి? ఎందుకు ఆ జిల్లాలోనే విజృంభిస్తోంది. వైద్య నిపుణులు ఎమంటున్నారో ఈ కథనంలో తెలుసుకుందాం.

tb_cases_atp
tb_cases_atp (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 22, 2024, 10:02 AM IST

అనంతలో విజృంభిస్తున్న క్షయ - పోషకాహార లోపమే కారణమా! (ETV Bharat)

TB Cases Increasing Alarming in Anantapur District : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. పోషక ఆహారానికి దూరమైన అనేక మంది పేదలు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఏటా 50 నుంచి 80 మంది క్షయవ్యాధితో మృత్యువాత పడుతున్న పరిస్థితులు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో కోవిడ్ అనంతరం క్షయవ్యాధి ఎక్కువగా విస్తరించినట్లు వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కరోనా కారణంగా ప్రజల ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కరంగా మారడంతో, పౌష్ఠిక ఆహారం మాట అటుంచి కనీసం రోజువారీ ఆహారం సమకూర్చులేక ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు, నగరాల్లోని మురికి వాడల్లో ప్రజలు పోషకాహారానికి దూరమై క్షయవ్యాధి బారిన పడినట్లు తెలుస్తోంది.

TB తగ్గాక మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - World TB Day 2024

"అనంతపురం జిల్లాలో క్షయ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. కరోనా అనంతం ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా పెరుగుతూ వచ్చారు. వీరిని ఉచిత మందులతో పంపిణీతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో పోషకాహారానికి సరఫరా చేస్తున్నాము. కొంత మంది క్షయ వ్యాధి చివరి దశలో ఆసుపత్రికి వస్తున్నారు" _డా.అనుపమ, అనంతపురం జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి

కేంద్ర ప్రభుత్వం టీబీ వ్యాధి మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నా, వాటిని వినియోగిస్తున్న రోగులకు పౌష్ఠిక ఆహారం అందడం లేదు. క్షయ రోగం నయం కావడానికి మందులు 50 శాతం పనిచేస్తే, పుష్ఠికరమైన ఆహారం మరో 50 శాతం మేర ఉపకరిస్తుందనేది అధ్యయనాల్లో స్పష్టమైంది. క్షయ వ్యాధి లక్షణాలున్న రోగులకు నెలరోజులకు సరిపడా ఔషధ కిట్ ఇచ్చి పంపుతున్నారు. 30 శాతం పైగా రోగులు ఈ మందులు వేసుకున్న తర్వాత పౌష్ఠిక ఆహారం తీసుకోకపోవడంతో కడుపులో మంట, కళ్లు తిరగడం వంటి లక్షణాలతో మందులు ఆపేస్తున్నారు. ఇలాంటి వారితో రోగనిరోధక శక్తిలేని మరికొందరికి ఈ వ్యాధి సోకుతోందని తెలుస్తోంది.

అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతున్న బాలుడు - ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు - A Boy With A Rare Disease

2025 నాటికి క్షయను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదనేది అనంతపురం జిల్లాను పరిశీలిస్తే తెలుస్తుందని సామాజిక వేత్తలు చెబుతున్నారు.

ఆదోనిలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత- ఒకరి పరిస్థితి విషమం - Drinking Contaminated Water

ABOUT THE AUTHOR

...view details