Sweet Shops Crowded During Diwali Festival in Vijayawada :నెల మీద మెరిసే దీపపు మెరుపులు, నింగిని తాకే తారాజువ్వలంటే మనకు గుర్తొచ్చేది దీపావళి పండుగే. చీకటి రంగుల రంగేళి దీపావళికి తీపిని పంచే మిఠాయిలు బహుమతులు ఇవ్వడం అనవాయితీ. అందుకే విజయవాడలోని వ్యాపారస్థులు నోరురించే స్వీట్లు అందుబాటులో ఉంచారు. పండుగకి ఒక రోజు ముందు నుంచే నగరవాసులు మిఠాయిలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోలుదారులతో దుకాణాలు రద్దీగా మారాయి.
భారతీయలు అత్యంత సంప్రాదాయంగా జరుపుకునే పండగల్లో దీపావళి ఒకటి. అటువంటి దీపావళి అంటే అందరికి గుర్తుకు వచ్చేది టపాసులు, స్వీట్లు. విజయవాడలోని టపాసుల కేంద్రాలతో పాటు స్వీట్ల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మిఠాయిలు కొనుగోలు చేసి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఇచ్చేందుకు దుకాణాలకు క్యూ కడుతున్నారు. మిఠాయిలు, ఎండు ఫలాలు కొనుగోలు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా దుకాణదారులు రకరకాల గిఫ్ట్ ప్యాకెట్లు తయారు చేసి సిద్ధంగా ఉంచారు. మిఠాయిలతో పాటు కాజు, బాదాం, పిస్తా, కిస్మిస్లు, వంటి డ్రై ఫ్రూట్స్లను అందమైన గిఫ్ట్ ప్యాకెట్ల రూపంలో అమర్చి వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. దీపావళికి ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్స్‌తో పాటు చాక్లెట్లతో తయారు చేసిన బార్బీ బొమ్మ కొనుగోలుదారులను ఆకట్టుకున్నాయి.