Survey in Sajjala Ramakrishna Estate in CK Dinne of YSR District : వైఎస్సార్ జిల్లా సీకే దిన్నె మండలంలోని సజ్జల ఎస్టేట్‌లో అధికారులు రీ సర్వే చేపట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు అటవీ శాఖ భూమిని ఆక్రమించారనే ఆరోపణలపై అధికారులు సర్వే చేస్తున్నారు. ఇప్పటికే సజ్జల ఎస్టేట్‌లో 55 ఎకరాలు అటవీ భూమి ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మరోమారు రీసర్వే చేసి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు సూచనల మేరకు మూడు శాఖల అధికారులు సజ్జల ఎస్టేట్‌లో కొలతలు వేస్తున్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు 146 ఎకరాల భూమి ఉంది. ఇందులో 55 ఎకరాలు అటవీ భూమి ఉందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఆ భూమి తమది కాదని అటవీశాఖ వాదిస్తుంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వే చేసి హద్దులు గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ కడప ఆర్డీవో ఆధ్వర్యంలోని రెవెన్యూ అధికారుల బృందం, అటవీశాఖ అధికారులు, ల్యాండ్ సర్వేయర్ల బృందం సజ్జల ఎస్టేట్‌లో సర్వే చేస్తుంది.