Avinash Reddy criminal history: వైఎస్ఆర్ కడప ఎంపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఓవైపు అన్నతమ్ముడు నిలబడగా, మరోవైపు అక్కచెల్లి వారికి ఎదురొడ్డి పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై ఉన్న నేరచరిత్ర వివరాలను వెల్లడించలేదని వైఎస్ వివేకా కుమార్తె సనీత రెడ్డి ఆరోపించారు. ఆ వివరాలు వెల్లడించకపోవడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
వివేక హత్యలో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి నేరచరిత్ర గురించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి నామినేషన్ వేసి 48 గంటలు దాటిన ఎందుకు ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు హత్యా నేరంలో పాలుపంచుకున్న వారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని సునీత అన్నారు.
వైఎస్ఆర్ జిల్లా వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తులసిరెడ్డి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన సునీత, కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిలను గెలిపించాలని అభ్యర్థించారు. నామినేషన్ ఫైల్ చేసిన 48 గంటల్లోపు లోకల్ నేషనల్ న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియాలో అభ్యర్థుల నేర చరిత్ర గురించి ప్రకటనలు ఇవ్వాలి. 40 ఏళ్లుగా పులివెందుల ప్రజలకు వివేకానంద రెడ్డి ఎంతో సేవ చేసాడు .. ఆయన రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందనీ సునీత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో న్యాయం కోసం పోరాడుతున్న షర్మిలను గెలిపించాలని నేర చరిత్ర కలిగిన వారికి, హత్య కేసులో నిందితులకు ఓటేయొద్దని సునీత ప్రజలకు పిలుపునిచ్చారు.