ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం - TTD MEMBER SUCHITRA ELLA

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యురాలిగా సుచిత్ర ఎల్ల ప్రమాణ స్వీకారం -అధికారుల సమన్వయంతో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడి

Suchitra Ella Sworn As Ttd Trust Board Member
Suchitra Ella Sworn As Ttd Trust Board Member (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 3:34 PM IST

Suchitra Ella Sworn As TTD Trust Board Member :తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి సభ్యురాలిగా ప్రముఖ భారత్ బయోటెక్ ఎండీ (Bharat Biotech MD) సుచిత్ర ఎల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఆలయంలోకి వెళ్ళిన ఎల్ల సుచిత్ర దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో సుచిత్ర ఎల్లాతో రంగనాయకుల మండపంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాలక మండలి సభ్యురాలిగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారం అనంతరం గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకున్న ఎల్ల దంపతులకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవుడు తనకు రెండో అవకాశం ఇచ్చారని, ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కృత్తజ్జతలు ఎల్ల సుచిత్ర తెలిపారు. టీటీడీ ఛైర్మన్, అధికారుల సమన్వయంతో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని ఆమె తెలిపారు.

సుచిత్ర ఎల్ల భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, ఎల్ల ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా సమయంలో భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవిడ్‌ టీకా తయారు చేసి, ప్రపంచానికి అందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ఆమె టీటీడీ సభ్యురాలిగా పని చేశారు.

తిరుమలలో అన్యమత ప్రచారం జరిగితే కఠిన చర్యలు: టీటీడీ ఛైర్మన్​ బీఆర్ నాయుడు

"దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు నా కృతజ్జతలు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అధికారుల సమన్వయంతో భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం."- సుచిత్ర ఎల్లా

సుచిత్ర ఎల్లతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులుగా బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్ త‌దితరులు పాల్గొన్నారు.

29 మంది సభ్యులతో టీటీడీ బోర్డు - ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు

శ్రీవారి భక్తులకు అలర్ట్ - కాలినడకన వెళ్లాలనుకుంటే ఈ సూచనలు పాటించండి

ABOUT THE AUTHOR

...view details