Students Dropout Rate Increasing :ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లేమి తదితర సమస్యలు రాష్ట్రంలో విద్యారంగాన్ని వేధిస్తున్నాయి. పదో తరగతిలోపు చదువు మానేస్తున్న వారి సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉంది. 2021-22లో 16.29శాతం మంది పదో తరగతిలోపు బడులు మానేశారు. 2020-21లో మానేసిన వారు 16.73శాతం మంది. ప్రాథమికోన్నత బడుల్లో చదువు మానేస్తున్న పిల్లలు 2020-21లో 0.52శాతం మంది కాగా 2021-22లో 1.62 శాతం మందికి చేరారు. ఈ లెక్కన ఎనిమిదో తరగతిలోపే దాదాపు రెండు శాతం మంది చదువుకు స్వస్తి చెప్పేస్తున్నారు. ఈ వివరాలను సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు అనుమతుల మండలి మినిట్స్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. ఎస్‌ఎస్‌ఏ నిధుల మంజూరుకు ఏటా కేంద్ర ప్రభుత్వం పీఏబీ సమావేశాన్ని నిర్వహిస్తుంది. 2024-25 విద్యా సంవత్సరం నిధులకు సంబంధించి గత జనవరిలో ఈ సమావేశం నిర్వహించగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం మినిట్స్‌ను విడుదల చేసింది.
రాష్ట్రంలో ఏకోపాధ్యాయ బడుల సంఖ్య భారీగా పెరిగినట్లు కేంద్రం వెల్లడించింది. 11వేల409 పాఠశాలలు ఒక్క టీచర్‌తోనే కొనసాగుతున్నట్లు ప్రకటించింది.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందనేందుకు ఏకోపాధ్యాయ బడులే నిదర్శనం. 2020 అక్టోబరు నాటికి సింగిల్ టీచర్ బడులు 7,774 ఉండగా 2021-22 సంవత్సరానికి ఆ సంఖ్య 9,602కు చేరింది. ఇప్పుడు 11 వేలకు పెరిగింది. రాష్ట్రంలో 45,137 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 46 బడుల్లో గతేడాది ఒక్కరూ చేరలేదు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు చేరని దుస్థితి ఏర్పడుతుండగా ఉన్నవారూ తగ్గిపోతున్నారు. 22,779 పాఠశాలల్లో 50 మంది కంటే తక్కువ మంది పిల్లలు ఉన్నారు. విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తిని తగిన స్థాయిలో నిర్వహించేందుకు హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంటుందని పాఠశాల విద్య, అక్షరాస్యత కార్యదర్శి సూచించారు.
'పది'తోనే సరిపెడుతున్నారా?!- సప్లమెంటరీ పరీక్షలకు విద్యార్థుల గైర్హాజర్‌పై ఆందోళన - SSC SUPPLEMENTARY EXAMS
చదువులు చాలించేస్తున్నారు!- పదో తరగతిలోపే బడి మానేస్తున్న విద్యార్థులు (ETV Bharat) కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో 14.96శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రాష్ట్రానికి 235 టైప్-4 కేజీబీవీలను మంజూరు చేస్తే 88 కేజీబీవీలను ప్రారంభించనే లేదు. విద్యాశాఖలో కీలకమైన రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి- ఎస్‌సీఈఆర్టీ, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో పోస్టులు భారీగా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం కొన్నేళ్లుగా వీటిని భర్తీ చేయడం లేదు. ఉపాధ్యాయ విద్యాసంస్థలు, పాఠ్యాంశాలను రూపొందించే ఎస్‌సీఈఆర్టీలోనే ఈ దుస్థితి ఉంటే నాణ్యమైన విద్య ఎలా వస్తుంది? ఎస్‌సీఈఆర్టీలో 16.6శాతం, డైట్‌ల్లో 60.06శాతం ఖాళీలు ఉన్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్లను తయారు చేయాల్సిన డైట్ కళాశాలల్లో 60శాతం ఖాళీలు ఉన్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించింది. ప్రాధాన్య ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయాలని కేంద్రం ఆదేశించింది. డైట్‌లలో జూన్ 30 నాటికి ఖాళీలు నింపాలని సూచించింది.
ఓ వైపు తల్లి మరణం - మరోవైపు భవిష్యత్ - బాధను దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరు - Student Attend to SSC Exam
మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణం, ల్యాబ్‌లు, సౌర విద్యుత్తు పలకలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఇచ్చిన నిధులు సరిపోవడం లేదంటూ సమగ్ర శిక్షా అభియాన్ వెనక్కి ఇచ్చేసింది. కొన్నేళ్లుగా పనుల్ని పెండింగ్ పెట్టి, ఇప్పుడు యూనిట్ కాస్ట్ సరిపోవడం లేదంటూ వెనక్కి ఇచ్చేశారు. అదనపు తరగతి గదులు, సైన్సు ల్యాబ్‌లు, సైన్సు ల్యాబ్‌ల సామగ్రి కొనుగోలు, ఆర్ట్, క్రాఫ్ట్ గదులు, గ్రంథాలయ గదులు, వసతి గృహాలపై సౌర విద్యుత్తు ప్యానళ్ల ఏర్పాటుకు ఇచ్చిన నిధులు సరిపోవడం లేదంటూ 126 పనులకు సంబంధించి 124.77 కోట్లను వెనక్కి ఇచ్చేసింది. పెంచిన యూనిట్ కాస్ట్‌తో చేపట్టిన అదనపు తరగతి గదుల పనులు 2.80శాతం, బాలుర మరుగుదొడ్లు 2.68శాతం, బాలికల మరుగుదొడ్లు 2.13శాతం, సమగ్ర సైన్సు ల్యాబ్స్ 18.60శాతం, స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లకు సంబంధించి 33శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించింది.
కొడుకుతో కలిసి టెన్త్ ఎగ్జామ్స్ రాసిన 'జ్యోతి'- ఎన్ని మార్కులతో పాసైందంటే? - Mother And Son Passed In Tenth Exam