ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాగులో బుల్లెట్లు - విమానాశ్రయానికి విద్యార్థి - ఏం జరిగిందంటే? - STUDENT CAUGHT WITH BULLETS

గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికుడి వద్ద 2 బుల్లెట్లు లభ్యం - పోలీసులకు అప్పగించిన భద్రతా సిబ్బంది

student_caught_with_bullets
student_caught_with_bullets (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 4:52 PM IST

Student Caught with Two Bullets at Gannavaram Airport:విజయవాడ నుంచి దిల్లీ వెళ్తున్న ఓ ప్రయాణికుడి నుంచి భద్రతా సిబ్బంది రెండు బుల్లెట్​లు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని పానిపట్టుకు చెందిన ఆర్య అనే విద్యార్థి గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఎయిర్ ఇండియా విమానంలో దిల్లీ ప్రయణించేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో ఆర్య వద్ద రెండు (ఒకటి మిస్ ఫైర్, మరొకటి సాధారణ) బుల్లెట్లు లభ్యమయ్యాయి.

వెంటనే ఆర్యను విమానాశ్రయం పోలీసులు అదుపులోకి తీసుకుని గన్నవరం స్టేషన్​లో అప్పగించారు. ఆర్య తండ్రి రూతోట్ 2008-10 మధ్య ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీగా విధులు నిర్వహించారు. రూతోట్ పని చేసిన సమయంలో లైసెన్స్ కలిగిన గన్​, బుల్లెట్​లు కలిగి ఉన్నాడు. గత సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆర్య పొరపాటున బుల్లెట్లు ఉన్న బ్యాగ్​ను రైలు మార్గం మీదుగా కళాశాలకు తీసుకొచ్చాడు. వాటిని ఈ రోజు విమాన మార్గంలో ఇంటికి వెళ్తుండగా అధికారులు గుర్తించారు. విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details