ETV Bharat / state

మినిస్టర్స్, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు కీలక భేటీ- ఉదయం నుంచి సాయంత్రం వరకు - CM MEETING WITH SECRETARIES

ఈ నెల 11న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 వరకు సమావేశం - మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో పాలనా అంశాలపై చర్చ

CM CHANDRABABU
CM CHANDRABABU (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 9, 2025, 7:55 PM IST

CM CHANDRABABU MEETING WITH SECRETARIES: ఈ నెల 11వ తేదీన సచివాలయంలో అన్ని శాఖల కార్యదర్శులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఈ సమావేశంలో పాలనా అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రెండు సెషన్లుగా మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరగనుందని తెలియడంపై ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.

మొదటి సెషన్​లో ఫైళ్ల క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీలపై చర్చించనున్నారు. రెండో సెషన్​లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశ పెట్టే ఏపీ బడ్జెట్, శాఖల వారీగా ప్రగతి మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చ జరగనుంది. దీనిపై 10వ తేదీ మధ్యాహ్నం లోగా సెక్రటరీలు తమ డిపార్ట్​మెంట్​కు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎంఓ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకనుగుణంగా కార్యదర్శులు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సీఎస్ ఆదేశాలిచ్చారు.

ఈనెల 10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

'సంస్కరణలను అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.