State Level Bullock Cart Race 2024 :తూర్పుగోదావరి జిల్లా ఏడీబీ రోడ్డులోని రంగంపేట-వడిశలేరు మధ్య ఆదివారం రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఇవి హోరాహోరీగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి వచ్చిన 63 ఎడ్ల జతలకు 1,600 మీటర్లు (సీనియర్స్), 1000 మీటర్లు (జూనియర్స్) విభాగాలుగా పరుగు పోటీలు నిర్వహించారు. గన్ని సత్యనారాయణమూర్తి 6వ వర్ధంతిని పురస్కరించుకుని జీఎస్‌ఎల్ ఆసుపత్రి ఛైర్మన్ గన్ని భాస్కరరావు వీటిని ఏర్పాటు చేశారు. మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఎన్.చినరాజప్ప పోటీలను ప్రారంభించారు.
సీనియర్స్ విభాగంలో ప్రథమస్థానంలో కోరా శృతి చౌదరి (గుమ్మిలేరు, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా), ద్వితీయ స్థానంలో శ్రీఆంజనేయం (కె.జి.పురం, అనకాపల్లి జిల్లా), తృతీయ స్థానంలో కోరా శృతి చౌదరి (గుమ్మిలేరు, డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) నిలిచారు. విజేతలకు బహుమతులుగా ద్విచక్ర వాహనాలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, రుడా ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రుడా మాజీ ఛైర్మన్ గన్ని కృష్ణ అందజేశారు.