తెలంగాణ

telangana

ETV Bharat / state

నృత్యకారుడిగా రాణిస్తున్న రమేశ్‌ కోలి - మరాఠా గడ్డపై తెలంగాణ సంస్కృతికి జీవం - Special Story On Dancer Ramesh Koli - SPECIAL STORY ON DANCER RAMESH KOLI

Special Story On Dancer Ramesh Koli : ఏంటి ఈ కుప్పిగంతులు బతుకు దెరువు కోసం వలస వచ్చాం ఈ డ్యాన్స్ మనకు తిండిపెడుతుందా అంటూ తల్లిదండ్రులు వద్దన్నారు. అయినా ఆ ఏ మాత్రం నిరాశ చెందక శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాలు చూస్తూ భరతనాట్యం, కూచిపూడి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అలా పట్టుదలతో నేర్చుకున్న కళ కోసం పదో తరగతిలోనే నృత్య కళాంజలి అనే సంస్థను స్థాపించాడు. పాతికేళ్లుగా ముంబయిలో ప్రదర్శనలిస్తూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే ప్రయత్నం చేస్తూ ప్రశంసలందుకుంటున్నాడు. తనే పాలమూరు జిల్లా మక్తల్ యువకుడు రమేశ్‌ కోలి. ముంబయిలో స్థిరపడిన తెలుగు యువకుడి పాతికేళ్ల కళా ప్రస్థానం ఇది.

Special Story On Dancer Ramesh Koli
Special Story On Dancer Ramesh Koli

By ETV Bharat Telangana Team

Published : Apr 13, 2024, 5:14 PM IST

నృత్యకారుడిగా రాణిస్తున్న రమేశ్‌ కోలి - మరాఠా గడ్డపై తెలంగాణ సంస్కృతికి జీవం

Special Story On Dancer Ramesh Koli :ముంబయి పాశ్చాత్య సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం. పబ్ కల్చర్‌కు అలవాటు పడిన అక్కడి జనాలకు డిస్కో సౌండ్ వినపడందే తెల్లారదు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు విలాసవంతంగా జీవించాలనే ఆశపడుతుంటారు. అలాంటి మరాఠా గడ్డపై ఈ తెలుగు యువకుడు మనదైన సంస్కృతి, సంప్రదాయాలను బతికించే ప్రయత్నం చేస్తున్నాడు. ఫైన్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి వేలాది మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు.

ఇక్కడ డాన్స్‌ చేస్తూ కనిపిస్తున్న ఈ కళాకారుడి పేరు రమేశ్‌ కోలి. స్వస్థలం మహబూబ్​నగర్ జిల్లా మక్తల్. కుటుంబమంతా ముంబయికి వలసపోవడంతో(Migration) అక్కడే పుట్టి పెరిగాడు. అంబర్​నాథ్‌లో తండ్రి వాహనాలు నడుపుతుండేవాడు. తల్లి చిన్నా చితక పనులు చేస్తూ జీవించేవారు. చిన్నతనంలోనే రమేష్‌కు డ్యాన్స్ అంటే ఇష్టం. చక్కగా డ్యాన్స్ చేస్తూ తోటి పిల్లలను అలరించేవాడు. ఉపాధ్యాయుల(Teachers) నుంచి కూడా మంచి ప్రోత్సాహం లభించేది.అయితే తను డ్యాన్స్(Dance) చేయడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండేది కాదని చెబుతున్నాడు.

Young Man Talent In Dance : సాధారణంగా ముంబయి మహానగరంలో అబ్బాయిలు క్లాసికల్ డ్యాన్స్ పట్ల పెద్దగా ఆసక్తి చూపించరు. అమ్మాయిలే ఎక్కువగా డ్యాన్స్ నేర్చుకోడానికి ఇష్టపడతారు. అయితే రమేశ్‌ శాస్త్రీయ నృత్యం పట్ల అభిరుచి కనబరిచినప్పటికీ సరిగా నేర్పేవారు అందుబాటులో లేరు. ఆ సమయంలో తాను ఉన్న అంబర్‌నాథ్ నుంచి రోజూ గంటన్నర ప్రయాణం చేసి తెలిసిన గురువు వద్ద భరతనాట్యం(Bharata natyam), కూచిపూడి నేర్చుకున్నాడు.

అభిరుచికి ప్రముఖుల ప్రోత్సాహం తోడు : చదువుల్లో రాణిస్తూనే హాబీగా ఎంచుకున్న శాస్త్రీయనృత్య కళలో కూడా ప్రతిభ, నైపుణ్యాలు సంపాదించుకున్నాడు రమేశ్‌. తర్వాత ఓ స్నేహితురాలి పరిచయం వల్ల ప్రముఖ నటి హేమమాలి గ్రూపులో ప్రదర్శనలకు చోటు దొరికింది. అలాగే నటి జయప్రద ప్రోత్సహం కూడా తోడైంది. అలా ప్రముఖులు ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడంతో ఈ కళాకారుడికి మరింత గుర్తింపు దొరికింది. Byteరమేశ్‌ కోలి, నృత్యకళాంజలి వ్యవస్థాపకుడు

Ramesh Dance Shows In Mumbai :శాస్త్త్రీయ నృత్యానికి జానపద, ఆధ్మాత్మికతను జోడించి రమేష్ ఇచ్చిన ప్రదర్శనలు ముంబయిలోని తెలుగువారిని అమితంగా ఆకట్టుకునేవి. దాంతో అవకాశాలు వరించాయి. అక్కడి నుంచి రమేష్ జీవితం కొత్త మలుపు తిరిగింది. అంతర్జాతీయ డ్యాన్స్ గ్రూపులో(International Dance Group) సభ్యుడిగా చోటు దక్కింది. అలాగే హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ నాట్య ప్రదర్శన తో ఔరా అనిపించాడు. గతేడాది మహారాష్ట్ర రాజ్ భవన్‌లో(Raj Bhavan) ప్రదర్శన ఇచ్చిన తొలి తెలుగు కళాకారుడిగా శభాష్ అనిపించుకున్నాడు.

ముంబయి తెలుగువారికి సుపరిచితుడు : ప్రస్తుతం ముంబయిలోని తెలుగు వారుండే ప్రాంతాల్లో రమేశ్‌ కోలి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అంతలా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ కళాకారుడు. తెలుగు సంఘాలు పర్వదినాలు, శుభకార్యాల్లో ప్రదర్శనలకు ఏర్పాటు చేస్తే కచ్చితంగా రమేశ్‌ ఉండాల్సిందే. అంతలా అక్కడి వారితో మమేకమయ్యాడు. ఫలితంగా శాస్త్రీయ నృత్యం ద్వారా ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నాడు ఈ ఔత్సాహికుడు.

చైనా యుద్ధ విద్యలో సత్తాచాటుతున్న అన్నాచెల్లెళ్లు - తండ్రి ప్రోత్సాహంతో వుషూ క్రీడలో రాణింపు

Nrythyakalanjali Institute of Fine Arts Institute : నృత్యకళాంజలి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి వేలాది మంది యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు రమేశ్‌. పాఠశాల రోజుల్లో ఒంటరిగా మొదలైన తన నాట్య ప్రయాణంలో ఇప్పుడు ఇంతమంది భాగస్వాములు అవ్వడం గర్వంగా ఉందంటున్నాడు. అయితే కళాకారులను మరింతగా ప్రభుత్వాలు అదరించి ప్రోత్సహిస్తే నలుగురికి ఉపాధితోపాటు మన కళలు, సంస్కృతులను కాపాడుకున్న వాళ్లం అవుతామంటున్నాడు.

మరింత మంది కళాకారులను తయారు చేసే దిశగా : మరాఠా గడ్డపై తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు జీవం పోస్తున్న రమేష్ తన స్వస్థలమైన మక్తల్‌లో విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన ఇవ్వాలని సంకల్పించుకున్నాడు. అలాగే నిరుపేద విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఓ కళాశాలను ఏర్పాటు చేసి భరతనాట్యం, కూచిపూడి నేర్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ ప్రయత్నాలు విజయవంతమై తనలాంటి ఎంతో మంది కళాకారులను తయారు చేయాలని మనమూ ఆశిద్దాం.

Thanjavur painting: 'కళాకారుడిగా రాణిస్తున్న చిన్నపిల్లల వైద్యుడు'

తండ్రి బాటలో చిత్రకారిణిగా రాణిస్తున్న ప్రియాంక ఏలే - ఔరా అనిపించేలా పెయిటింగ్స్​

ABOUT THE AUTHOR

...view details