SP Vakul Jindal Press Meet on Ganja and Murder Cases:విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజులు క్రితం జరిగిన కృష్ణవేణి అనే ఒక వృద్దరాలు హత్య కేసును పోలీసులు ఛేదించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్‌లో భాగంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా బొబ్బిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి తరలిస్తున్న 8 మందిని పట్టుకున్నామని చెప్పారు. ఈ మూడు కేసులకు సంబంధించిన వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు.
వృద్ధురాలి హత్య:జిల్లాలోని బాడంగిలో వృద్ధురాలిని పక్క ఇంట్లో ఉంటున్న మహిళే హత్య చేసినట్లు గుర్తించామని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. వృద్దురాలి వద్ద భారీగా నగదు, బంగారం ఉందని గుర్తించిన కలిశెట్టీ లలిత కుమారి, తన అవసరాల కోసం వాటిని కాజేయాలని పథకం పన్ని హత్య చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. పథకంలో భాగంగానే వృద్దురాలితో ముందు నుంచే స్నేహం నటించేదని తెలిపారు. ఒకానొక సమయంలో వృద్దురాలు ఒంటరిగా ఉన్నట్లు గుర్తించి ఇంట్లోకి ప్రవేశించి చున్నీని మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసిందని వివరించారు. ఆ తరువాత వృద్ధురాలి ఒంటిపై ఉన్న 14.5 తులాల బంగారం దోచుకుని వెళ్లిపోయిందని వివరించారు. క్లూస్ టీమ్, టెక్నికల్ ఏవిడెన్స్ సహాయంతో కేసును చేదించినట్లు ఎస్పీ వివరించారు. హత్య చేసిన తర్వాత బంగారం దోచుకుని విశాఖలోని కంచరపాలెం వెళ్లిపోయిందని అన్నారు. వెంటనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకుని ఆ సొత్తును రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
పదేళ్ల నాటి మావోయిస్టుల డంప్ - భారీ మొత్తంలో పేలుడు సామగ్రి