Special Trains for AP Elections: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ నెల 10వ తేదీ నుంచి 15 వరకు 50 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మే 13న శాసనసభ, లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలి వచ్చేందుకు ఓటర్లు సిద్ధం - రైళ్లు, బస్సుల్లో సీట్లన్నీ ఫుల్ - People Ready to vote
10వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- సోలాపూర్-తిరుపతి
- కాకినాడ-కాచిగూడ
- సికింద్రాబాద్-బెర్హంపూర్
- అగర్తాల-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-సంత్రగచ్చి
- సికింద్రాబాద్-కాకినాడ
- కాచిగూడ-నాగర్సోల్
- తిరుపతి-అకోలా
11వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- బెర్హంపూర్-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-బెర్హంపూర్
- హైదరాబాద్-నర్సాపూర్
- సికింద్రాబాద్-సంత్రగచ్చి
- కాకినాడ-సికింద్రాబాద్
- సికింద్రాబాద్-దానాపూర్
- హైదరాబాద్-నర్సాపూర్
12వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- బెర్హంపూర్-సికింద్రాబాద్
- తిరుపతి-మచిలీపట్నం
- సంత్రగచ్చి-సికింద్రాబాద్
- తిరుపతి-శ్రీకాకుళం
- తిరుపతి-సికింద్రాబాద్
- అకోలా-తిరుపతి
- నర్సాపూర్-హైదరాబాద్
13వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- సికింద్రాబాద్-అగర్తాల
- సికింద్రాబాద్-దిబ్రుగర్
- మచిలీపట్నం-తిరుపతి
- నర్సాపూర్-హైదరాబాద్
- సికింద్రాబాద్-శాలిమార్
- శ్రీకాకుళం-తిరుపతి
- కాకినాడ-లింగంపల్లి
- సికింద్రాబాద్-తిరుపతి
- నాందేడ్-కాకినాడ
- పూర్ణా-తిరుపతి
- సంబల్పూర్-కాచిగూడ
- విశాఖపట్టణం-తిరుపతి
14వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- సికింద్రాబాద్-సంత్రగచ్చి
- శాలిమార్-సికింద్రాబాద్
- లింగంపల్లి-కాకినాడ
- కాకినాడ-నాందేడ్
- కాచిగూడ-సంబల్పూర్
- తిరుపతి-విశాఖపట్టణం
- విశాఖపట్టణం-కర్నూల్
15వ తేదీన ప్రత్యేక రైళ్లు:
- సంత్రగచ్చి-సికింద్రాబాద్
- కాకినాడ-లింగంపల్లి
- సికింద్రాబాద్-నాగర్సోల్
- కర్నూల్-విశాఖపట్టణం
- విశాఖపట్టణం-సికింద్రాబాద్
ఈ ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే బుధవారం అధికారికంగా ప్రకటించింది. అవసరమైతే ప్రయాణికుల డిమాండ్ మేరకు సాధారణ రైళ్లకు కూడా అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
'రాబోయే కొన్నేళ్లలో 1000 అమృత్ భారత్ రైళ్లు- ప్రతివారం పట్టాలపైకి ఒక ట్రైన్'