ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దారుణం - బతికుండగానే తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు - SON THROWS FATHER INTO CANAL

పల్నాడు జిల్లాలో ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద దారుణం - తండ్రిని కాలువలో పడేసిన కుమారుడు

Son_Throws_Father_Into_Canal
Son_Throws_Father_Into_Canal (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2025, 10:17 PM IST

Son Throws Father Into Canal while Still Alive: బతికుండగానే కన్న తండ్రిని కుమారుడు కాలువలో పడేసిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. ఈపూరు మండలం బద్రుపాలెం వద్ద ఈ దారుణం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నూజెండ్లకు చెందిన గంగినేని వెంకటేశ్వర్లు తన తండ్రి కొండయ్య (85)ను కారులో తీసుకొచ్చి బతికుండగానే బద్రుపాలెం వంతెన పైనుంచి సాగర్‌ కాలువలో పడేశాడు.

ఈ ఘటన చూసిన గ్రామస్థులు ఆ వృద్ధుడిని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును గ్రామస్థులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ఆసుపత్రికి తరలించారు. వినుకొండ గ్రామీణ సీఐ ప్రభాకర్‌, ఈపూరు ఎస్సై ఉమా మహేశ్వర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details