Son and Father Died in Dog Bite in Vishaka : కుక్క పేరు చెబితే విశ్వాసానికి ప్రతీక అని అంటారు. పెంపుడు కుక్కలు ఇంటిని సురక్షితంగా కాపాడటమే కాదు, బోలెడు కాలక్షేపాన్ని పంచుతాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రౌడీలు, గుండాల కన్నా, వీధి కుక్కలను చూస్తేనే ఇప్పుడు జనం ఎక్కువ భయపడిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. వీధి కుక్కలతో సమానంగా పెంపుడు కుక్కలు సైతం మరణానికి కారణమవుతున్నాయి.
వీధి కుక్కలంటే జనం బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని కాలనీల్లో ఐతే ఇళ్లల్లో నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వణికిపోతున్నారు. నిత్యం ఎక్కడో ఒక చోట శునకాల దాడులు జరుగుతూనే ఉన్నాయి. బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మే నెలలో పెంపుడు కుక్క దాడిలో ఓ 5 నెలల పసికందు మృతి చెందిన ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనే విశాఖ జిల్లాలో చోటు చోసుకుంది. పెంపుడు కుక్క కాటులో తండ్రి, కుమారుడు మృతి కన్నుమూశారు. పూర్తి వివరాల్లోకి వెళితే
విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ ఎగువుపేటలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. సరదా కోసం పెంచుకున్న కుక్క కరవడంతో తండ్రి కొడుకు మృతి చెందిన సంఘటనతో ఈ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులను గాయపర్చిన కుక్క రెండు రోజులకే మృతి చెందడంతో భీమిలి ప్రభుత్వాసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. మృతిని బంధువులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం భీమిలి జోన్ ఎగువపేటలో మత్స్యకార కుటుంబానికి చెందిన అల్లిపల్లి నర్సింగరావు(59), అల్లిపల్లి చంద్రావతి(57), కుమారుడు భార్గవ్(27) తో నివాసముంటున్నారు. వీరు సరదా కోసం కుక్కను పెంచుకుంటున్నారు.