Hotels Serving Contaminated Food to Devotees:ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోని కొన్ని హోటళ్లు భక్తులకు కలుషిత ఆహారాన్ని అందిస్తున్నాయి. వంటల్లో మోతాదుకు మించి రంగులు వాడటం, పురుగులు పట్టిన సరకులను ఉపయోగిస్తున్నట్లు అధికారుల సోదాల్లో బయటపడింది. గత నెలలో ఆహార భద్రత తనిఖీ అధికారులు తిరుపతిలోని కొన్ని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 36 నమూనాలు సేకరించగా అందులో మొత్తం 14(38.8%) శాంపిళ్లు సరిగ్గా లేవని గుర్తించారు. వీటిల్లో 6 నమూనాలు హానికరమని పరీక్షల్లో వెల్లడికాగా 8 నమూనాల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలింది.
తిరుపతికి తరలివచ్చే లక్షల మంది భక్తుల రద్దీకి తగినట్లు తిరుపతి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో వేల హోటళ్లు వెలిశాయి. వీటిల్లో తయారయ్యే ఆహారం ఎలా ఉంటుందన్న దానిపై అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటోంది. తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో కల్తీ జరగడంతో తిరుపతిలో ఉన్న హోటళ్ల నాణ్యతా ప్రమాణాలపైనా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వీటిపై స్పందించి వచ్చిన ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి.
సేకరించిన నమూనాలు:వివిధ హోటళ్ల నుంచి నెయ్యి, తందూరీ చికెన్, బ్లాక్ పెప్పర్, బెల్లం, జీడిపప్పు, గోబీ-65, మైసూర్‌పాక్, కందిపప్పు, చికెన్ ధమ్ బిర్యానీ, చికెన్ లాలీపాప్, చికెన్ పకోడా, వేరుసెనగ పప్పు, కారం, ఆవకాయ పచ్చడి ఇలా 36 రకాల నమూనాలు సేకరించారు.
'నిన్ను ఇక్కడ పెట్టిందెవరు?' - టీటీడీ ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం