Snake In Bike At Palasa Town: పలాస పట్టణంలో ఓ ద్విచక్ర వాహనంలోకి పాము దూరి హల్‌చల్ చేసింది. ద్విచక్ర వాహనంలో ఉన్న పాము ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. పలాసలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద ఎదురుగా ఉన్న వాహనదారుడు తన వాహనాన్ని పార్కింగ్ చేయగా అందులోకి పాము దూరింది. అటువైపుగా వెళ్తున్న వ్యక్తి దానిని గమనించి చోదకుడికి విషయాన్ని తెలపడంతో ఆయన భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు మోటార్ సైకిల్ నుంచి పామును బయటకు పంపించేందుకు ప్రయత్నించగా పక్కనే ఉన్న మరో వాహనంలోకి దూరిపోయింది. చివరకు సమీపంలోని పొదల వైపు వెళ్లిపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.
ఓ బైక్ నుంచి మరో బైక్లోనికి దూరిన పాము-చివరికి ఏమైందంటే? - SNAKE IN BIKE AT PALASA TOWN
పలాస పట్టణంలో ఓ ద్విచక్ర వాహనంలోకి పాము దూరి హల్‌చల్

SNAKE IN BIKE AT PALASA TOWN (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 18, 2025, 7:53 PM IST