ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు - భయంతో జనం పరుగులు

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు - విజయవాడ, హైదరాబాద్‌, విశాఖ, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు సెకన్ల పాటు కంపించిన భూమి

Small Earthquake in Telugu States
Small Earthquake in Telugu States (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 21 hours ago

Updated : 18 hours ago

Earthquake in Telugu States:తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.27 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, వేలేరుపాడు, కుక్కునూరు, బుట్టయగూడెం, టి.నరసాపురం మండలం బొర్రాంపాలెం, జంగారెడ్డిగూడెం పట్టణం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.

సుమారు ఐదు సెకండ్ల పాటు :జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్ రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించటంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్లామని స్థానికులు తెలిపారు. అదే విధంగా కొయ్యలగూడెంలో సుమారు ఐదు సెకండ్ల పాటు భూకంపం సంభవించటంతో ఇళ్లలోని వస్తువులు అన్ని కదిలాయన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు- భయంతో జనం పరుగులు

Small Earthquake in Hyderabad :తెలంగాణ రాష్ట్రంలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదు అయింది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌ - ఎన్‌జీఆర్‌ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది.

సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు :హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, కరీంనగర్‌, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు, హనుమకొండ, భూపాలపల్లితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ, ఇల్లెందు, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉంది.

మరోవైపు మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్​లోనూ భూమి కంపించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని సిర్వంచ, అహేరి, గడ్చిరోలి, చంద్రాపూర్​లో భూప్రకంపనలు వచ్చాయి. ఛత్తీస్​గఢ్​లోని సుకుమా, బీజాపూర్​లోనూ భూమి కంపించింది.

జపాన్​లో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న రాజమౌళి కొడుకు! - లేదంటేనా?

Last Updated : 18 hours ago

ABOUT THE AUTHOR

...view details