SI neglecting to catch the thieves in Uppal:చోరీ కేసులో దొంగలకు వకాల్తా పుచ్చుకున్న ఎస్ఐపై అధికారులు వేటు వేశారు. విధుల్లో నిర్లక్షం వహించినందుకు ఎస్ఐని డీసీపీ ఆఫీస్కు అటాచ్ చేసిన ఘటన రాచకొండ ఏరియాలోని ఉప్పల్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఉప్పల్ సీఐ తెలిపిన ప్రకారం... ఉప్పల్ బగాయత్లో పోకిరీల ఆగడాలు రోజురోజుకు శృతి మించిపోతున్నాయి. రాత్రి వేళ బగాయత్లోకి వచ్చే జంటలను పోకిరీలు బెదిరిస్తున్నారు. వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జంట బగాయత్కు రాగా, వారిని పోకిరీలు బెంరించారు. వారి వద్ద నుంచి సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
మేడ్చల్‌లో జ్యువెలరీ దోపిడీ కేసును చేధించిన పోలీసులు - ఇద్దరి అరెస్ట్ - jewellery shop robbery case
తమకు జరిగిన మోసంపై ఆ జంట పోలీసులను సంప్రదించింది. తమను బెదిరించి కొందరు వ్యక్తులు డబ్బులు వసులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ చోరీ చేసిన వ్యక్తులకు కొమ్ముకాశాడు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ, కంప్రమైజ్ కావాలని ఫిర్యాదుదారులకే సూచించాడు. దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ ఆ జంట ఉన్నతాధిధికారులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై వారు విచారణకు ఆదేశిచారు.