తెలంగాణ

telangana

ప్రారంభమైన మొహ‌ర్రం వేడుక‌లు - రక్తం చిందించిన షియా ముస్లీంలు - Bibika Alam procession

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 4:24 PM IST

Muharram Celebration In Old City : హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు మొదలైంది. అంబారిపై బయలుదేరిన బీబీ కా ఆలం ముందు షియా తెగకు చెందిన ముస్లింలు రక్తం చిందిస్తూ ప్రార్థనా గీతాలు అలపిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు కొనసాగుతున్న అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ అంక్షలు విధించారు.

Bibika Alam in Old City
Bibika Alam in Old City (ETV Bharat)

Bibika Alam Procession In Old City : హైదరాబాద్ పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. డబీర్‌పురలోని బీబీ కా అలవా నుంచి ఏనుగు అంబారిపై బీబీ కా ఆలం ఊరేగింపును భక్తిశ్రద్దలతో ప్రారంభించారు. అంబారిపై బయలుదేరిన బీబీ కా ఆలం ముందు షియా తెగకు చెందిన ముస్లింలు రక్తం చిందిస్తూ ప్రార్థనా గీతాలు అలపిస్తున్నారు.

డబీర్‌పుర బీబీ కా అలవా నుంచి మొదలైన ఊరేగింపు షేక్‌ఫైజ్‌ కమాన్‌, అలిజ కోట్ల, చార్మినార్, గుల్జార్‌ హౌజ్‌, పంజేష, మీర్‌ ఆలం మండి, పురానీ హావేలి, దారుల్‌ షిఫా, కాళీ ఖబర్, చాదర్‌ ఘాట్‌ వరకు కొనసాగుతుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు కొనసాగుతున్న అన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ అంక్షలు విధించారు.

పాతబస్తీవ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులు బ్లేడ్లతో తమను కోసుకుంటూ రక్తం చిందించారు. గాయాలయిన ముస్లిం సోదరులకు ప్రాథమిక చికిత్స బృందాలు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తున్నారు. చార్మినార్ వద్ద ఊరేగింపు చూసేందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు చేరుకున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ సమీపంలోని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి బీబీ కా ఆలంకు దట్టీలు సమర్పించారు. అదే విధంగా బీబీ కా ఆలంకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఏసీబీ డీజీ సీవీ ఆనంద్‌ తదితరులు దట్టీలు సమర్పించారు.

Bibi-Ka-Alam: ఘనంగా బీబీ-కా-ఆలం ఊరేగింపు.. రక్తం చిందించిన షియాలు

రాష్ట్రవ్యాప్తంగా మొహర్రం వేడుకలు : ఇక రాష్ట్రవ్యాప్తంగా మొహర్రం పండుగ సాగుతోంది. మహ్మద్‌ ప్రవక్త మనవడు, అతని కుటుంబ సభ్యులు ఈ నెలలోనే వీరమరణం పొందారు. వారిని స్మరిస్తూ పీరీలు ప్రతిష్టించి ఊరేగిస్తుంటారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కులమతాలకతీతంగా భక్తి, శ్రద్ధలతో కుడుకలు, బెల్లం ఇచ్చి పండగ జరుపుకుంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో భక్తులు మలీజా, దట్టి, పూలమాలలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో యువకులు పులి వేషాలతో పండుగ జరుపుకున్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ మండలం పామునూరులో అసోయ్‌ దూల అంటూ డ‌ప్పు చప్పుళ్లతో ఊరేగించారు.

Moharram celebrations in Hyderabad : మొహర్రం ఊరేగింపునకు సర్వం సిద్ధం.. పాతబస్తీలో ట్రాఫిక్​ అంక్షలు

ABOUT THE AUTHOR

...view details