ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : పైసా పెట్టుబడి లేకుండా స్వయం ఉపాధి రుణాలు - SCHEMES IN ANDHRAPRADESH 2025

యూనిట్‌ వ్యయంలో 50% సబ్సిడీ - మిగతా మొత్తం బ్యాంకు లోన్​ - వారం రోజుల్లో దరఖాస్తులు!

Self Employment Schemes in Andhrapradesh 2025
Self Employment Schemes in Andhrapradesh 2025 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 21, 2025, 10:57 AM IST

Self Employment Schemes in Andhrapradesh 2025 :వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీనవర్గాల్లో పేదరికాన్ని రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా వర్గాల్లోని పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను మరింత ఈజీగా, వేగవంతం చేసింది. 2024-25 సంవత్సరానికిగానూ రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు రూ. 896 కోట్లు, EWS వర్గాలకు రూ. 384 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభా ఆధారంగా ఈ నిధుల వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది. స్కీమ్​ అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల్లో అర్హుల నుంచి అప్లికేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలిచ్చారు.

మొత్తంగా ఈ సంవత్సరం స్వయం ఉపాధి రాయితీ రుణ పథకం కింద 1.30 లక్షల మంది బీసీలు, 59 వేల మంది EWS వర్గాలకు లబ్ధి చేకూరనుంది. గతంలో రాయితీ రుణాల మంజూరు స్కీమ్​లో ఎంపికైన వారు 'లబ్ధిదారు వాటా' కింద కొంత మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చేది. ఆపై కొంత సొమ్మును ప్రభుత్వం రాయితీపై అందించేది. మరికొంత బ్యాంకు లోన్​గా ఇప్పించేది. తాజా మార్గదర్శకాల్లో లబ్ధిదారు వాటాను తీసివేసింది. యూనిట్‌ వ్యవస్థాపక వ్యయంలో ప్రభుత్వ రాయితీ పోనూ, మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి లోన్​గా అందించనుంది. గత అనుభవాల దృష్ట్యా ఈ దఫా స్కీమ్​ పక్కాగా అమలయ్యేలా యూనిట్లకు జియోట్యాగింగ్‌ చేయించనుంది. పూర్తిస్థాయిలో గ్రౌండింగ్‌ అయ్యిందీ, లేనిదీ పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో తనిఖీ బృందాలను కూడా నియమించనున్నారు.

రాయితీ వివరాలు (ETV Bharat)

దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ :

స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాలకు అర్హుల నుంచి అప్లికేషన్ల స్వీకరణకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మానిటరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఓబీఎంఎంఎస్‌) అనే వెబ్‌ పోర్టల్‌ను డిజైన్​ చేసింది. దీనిద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో సొంతంగానూ అప్లై చేసుకోవచ్చు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఎంపీడీవో/మునిసిపల్‌ కమిషనర్లకు అప్పగించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇందుకు సహయం చేస్తారు. అప్లికేషన్ల పరిశీలనలో ఎవరైనా అనర్హులుగా తేలితే, వారి స్థానంలో మరొకరికి అవకాశం కల్పించేలా నిర్దేశిత లక్ష్యం కంటే అదనంగా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారు డాక్యుమెంటేషన్‌ కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగకుండా మొత్తం ప్రక్రియ ఎంపీడీవో/మునిసిపల్‌ కమిషనర్‌ ఆఫీస్​లోనే పూర్తి చేయనున్నారు.

సబ్సిడీ సొమ్ము బ్యాంకులకు జమ :

ఎంపికైన లబ్ధిదారుల సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం సంబంధిత బ్యాంకులకు జమ చేయనుంది. యూనిట్‌ ఏర్పాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను లబ్ధిదారులు బ్యాంకుకు సమర్పించిన వెంటనే వారు కొనుగోలు చేసిన దుకాణానికి సబ్సిడీ, బ్యాంకు లోన్ మొత్తం జమ చేయనున్నారు. యూనిట్లు మంజూరైన అనంతరం నియోజకవర్గ స్థాయిలో మేళాలు నిర్వహించి అందజేస్తారు. లబ్ధిదారులు సకాలంలో బ్యాంకు లోన్ వాయిదాల చెల్లింపును పర్యవేక్షించే బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిలో ఒకరికి అప్పగించనున్నారు.

అర్హతకు ప్రమాణాలివే :

  • దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారు
  • వయసు: 21- 60 ఏళ్ల మధ్య ఉండాలి

రుణ పథకాలకు వర్తించే యూనిట్లు :

  • మినీ డెయిరీ యూనిట్స్‌
  • గొర్రెలు, మేకల పెంపకం
  • మేదర, కుమ్మరి/ శాలివాహన కుటుంబాలకు ఆర్థిక సాయం
  • వడ్రంగి పనివారికి చేయూత
  • జనరిక్‌ దుకాణాలు

శిక్షణ కార్యక్రమాలు :

  • ఫ్యాషన్‌ డిజైనింగ్‌/ టైలరింగ్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఆతిథ్య రంగం

టీటీడీ మెనూలో మరో వంటకం - సంతోషం వ్యక్తం చేస్తున్న భక్తులు

త్వరలో వారందరికీ 3 సెంట్ల స్థలం! మార్గదర్శకాలు జారీ చేసిన కూటమి ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details