ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలాల్లో స్కూల్​ వ్యాన్​ బోల్తా - స్వల్ప గాయాలతో విద్యార్థులు సేఫ్ - School Bus Over turned - SCHOOL BUS OVER TURNED

School Bus Overturned in Vizianagaram District : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరదలు కొంత తగ్గడంతో పిల్లలు బడి బాట పట్టారు. ఈ క్రమంలో 19 మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్​ వ్యాన్​ అదుపు తప్పి పొలాల్లో పడిపోయింది.

school_bus_overturned_in_vizianagaram_district
school_bus_overturned_in_vizianagaram_district (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 2:54 PM IST

School Bus Overturned in Vizianagaram District :విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట సమీపంలో ప్రైవేట్‌ పాఠశాల వాహనం (School Van) బోల్తా పడింది. జయితి నుంచి విద్యార్థులను తీసుకుని గజపతినగరం వెళ్తుండగా వాహనం వరి పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో వాహనంలో 19 మంది విద్యార్థులు ఉన్నారు. సమీపంలోని రైతులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థులను బయటకు తీశారు.

ప్రమాదంలో భూవన తేజ్‌ అనే 6వ తరగతి విద్యార్థి స్వల్పంగా గాయపడ్డాడు. విద్యార్థిని చికిత్స నిమిత్తం స్థానికులు చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విద్యార్థులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకుని వెళ్లారు.

ఢీకొన్న రెండు లారీలు- ముగ్గురు మృతి- మరొకరికి తీవ్ర గాయాలు

ప్రమాదం ఎలా జరిగిందని పిల్లలను ఆరా తీయగా డ్రైవర్​ వాహనం వేగంగా నడపలేదని విద్యార్థులు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్ల బండి ఉండటంలో కొంత కంగారు పడి మలుపు తీసుకోబోయినప్పుడు వాహనం అదుపు తప్పినట్టు స్థానికులు తెలిపారు. పిల్లలు చిన్న చిన్న గాయాలతో తప్పించుకోవడంతో తల్లిదండ్రులు కుదుట పడ్డారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వాహనం పొలంలో పడటంతో దాన్ని తొలగించడానికి రైతులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా అనంతపురం జిల్లా డి. హీరేహాల్ మండలం కళ్యం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన బొమ్మలింగప్ప కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి రాయదుర్గం- బళ్ళారి రోడ్డు పక్కన నిద్రపోయాడు. వృద్ధుడ్ని లారీ డ్రైవర్ గమనించకుండా వృద్ధుడి చేతిపై నుంచి వాహనాన్ని పోనివ్వడంతో నుజ్జునుజ్జు అయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో క్షతగాత్రుడ్ని రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కానీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంతకుముందు బొమ్మలింగపను రాయదుర్గం వైద్యశాలకు తరలించే క్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

అదుపు తప్పి స్కూల్ వ్యాన్ బోల్తా - తప్పిన పెను ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details