Vijayawada Sanitation Problem : వానొస్తే చాలు విజయవాడ వాసులు బెంబెలెత్తుతున్నారు. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమై ఎక్కడ కాలుపెడితే ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాల్వల్లో పూడికతీత చేపడితే ఈ పరిస్థితి ఉండదని నగరపాలక సంస్థ అధికారులు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేయడం లేదని వాపోతున్నారు.
చినుకు పడితే చాలు విజయవాడ వాసులు చిగురుటాకులా వణికిపోతారు. ఏటా వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పడమట లంక, కరెన్సీ నగర్, మదర్ థెరిస్సా కూడలి, డీవీ మేనర్ రోడ్డు, జమ్మిచెట్టు సెంటర్, మొగల్రాజపురం, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో వర్షం పడితే నీరు నిలిచిపోతోంది. మధురానగర్, లయోలా కళాశాల రోడ్డు, ఆటోనగర్, బృందావన్ కాలనీ, విద్యాధరపురం అంబేడ్కర్ రోడ్డు, సితార కూడలి నుంచి కబేళా రోడ్డు, పాతబస్తీ, గణపతిరావు రోడ్డు నుంచి జెండాచెట్టు, సుబ్బరామయ్య వీధి, గాంధీ హిల్ నుంచి హనుమాన్ పేట ముంపునకు గురవుతాయి. బైపాస్ నుంచి బుడమేరు వరకు, నైజాం గేటు నుంచి కాంసాలిపేట వరకు ప్రజలకు వర్షాకాలంలో నరకయాతనే. ఏటా వానా కాలంలో రహదార్లు, కాల్వలు ఏకమవుతున్నాయి.
విజయవాడ బైపాస్ రోడ్డు నిర్మాణంలో జాప్యం - ఇంకా మోక్షం ఎప్పుడో? - Vijayawada West Bypass Road
విజయవాడ నగరంలో రోజుకు ఉత్పత్తి అయ్యే వ్యర్థాల్లో 20 మెట్రిక్ టన్నుల మట్టి, వ్యర్థాలు నేరుగా డ్రెయిన్లలోకి చేరిపోతున్నాయి. పలువురు వ్యాపారులు, హోటళ్ల యజమానులు వ్యర్థాలను నేరుగా డ్రెయిన్లలో వేస్తున్నారు. వీటిని నిలువరించడంలో క్షేత్రస్థాయి అధికారులు విఫలం అవుతున్నారు. ఫలితంగా నీరు డ్రైన్ల నుంచి రోడ్లపైకి చేరుతోంది.