Quality of Srivari Laddu Prasadam is Restored Again in Tirumala : వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో అపవిత్ర పదార్థాలున్న నెయ్యిని వినియోగించడంపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ అపోహలకు తావు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రస్తుతం నాణ్యతను పునరుద్ధరించినట్లు ప్రకటించింది. గతంలో వాడిన నెయ్యి, ప్రస్తుతం వినియోగిస్తున్న దానికి సంబంధించి ల్యాబ్ పరీక్షల నివేదికలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది.
ఎక్స్‌లో పోస్ట్‌చేసిన టీటీడీ : నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి, వినియోగించడం ద్వారా లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యాన్ని తిరిగి తెచ్చినట్లు ప్రజలకు టీటీడీ తెలిపింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఎక్స్ వేదికగా వివరించింది. శ్రీవారి లడ్డూ ప్రసాదాల పవిత్రతను తిరిగి పునరుద్ధరించామని పేర్కొంది. నాడు వైఎస్సార్సీపీ హయాంలో గుత్తేదారు సరఫరా చేసిన నెయ్యిలో ‘ఎస్’ విలువ ఎంత ఉండాలి, ఎంత ఉందనే విషయమై ల్యాబ్ నివేదికను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో (NDA Govt) సేకరిస్తున్న నెయ్యిలో ‘ఎస్’ విలువ ఏ మేరకు ఉందనే వివరాలనూ జతపరిచింది.
తిరుమల లడ్డూ కల్తీపై సంప్రోక్షణ యాగం - ఆదివారం తుది నిర్ణయం - Tirupati Laddu Ghee Controversy
ల్యాబ్ రిపోర్ట్‌లను ఎక్స్‌లో పోస్ట్ :శ్రీవారి లడ్డూ తయారీకి సరఫరా అవుతున్న నెయ్యిలో కల్తీ ఉందన్న విషయాన్ని గ్రహించిన టీటీడీ ఈవో శ్యామలరావు పరీక్షల నిమిత్తం ఎన్డీడీబీ (NDDB) కాఫ్ ల్యాబ్‌కు పంపించారు. నాలుగు ట్యాంకర్ల శాంపిళ్లను రెండు దఫాలుగా పరీక్షలకు ఇచ్చారు. రెండు ట్యాంకర్లకు సంబంధించిన నివేదికను ఇప్పటికే బహిర్గతం చేసిన అధికారులు ఇప్పుడు తాజాగా మరో రెండు ట్యాంకర్ల వివరాలను ఎక్స్‌లో వెల్లడించారు. తద్వారా ఎంత మేరకు కల్తీ జరిగిందనే విషయాన్ని ప్రజలే అర్థం చేసుకుంటారన్న భావన అధికారుల్లో నెలకొంది. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక నందిని నుంచి నెయ్యి కొంటున్నారు. ఆ నెయ్యి శాంపిల్‌నూ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికనూ వెల్లడించారు. నాడు సరఫరా చేసిన నెయ్యి ఇప్పుడు కొంటున్నదాని నాణ్యతలో ఎంత తేడా ఉందనే విషయం నివేదికలు చెప్పకనే చెబుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా తిరుమలలో కల్తీ నెయ్యిపై ఆగ్రహావేశాలు - భక్తుల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు - Tirumala Laddu Issue in AP
తిరుమల లడ్డూ కల్తీ వివాదం - బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : రాహుల్ గాంధీ, వెంకయ్యనాయుడు - TIRUMALA LADDU ISSUE