ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రిటర్న్​ జర్నీ - రద్దీగా విజయవాడ - హైదరాబాద్‌ హైవే - RUSH ON HYDERABAD HIGHWAY

సంక్రాంతి పండుగ ముగించుకొని హైదరాబాద్‌ వెళ్తున్న ప్రజలు - కీసర టోల్‌గేట్‌ నుంచి వరుసగా వెళ్తున్న వాహనాలు

rush on vijayawada hyderabad highway
రద్దీగా విజయవాడ - హైదరాబాద్‌ హైవే (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 16, 2025, 12:28 PM IST

సంక్రాంతి పండుగ సెలవులకు సొంతూర్లకు వచ్చిన ప్రజలు తిరిగి నగరబాట పట్టారు. సొంతూర్లలో పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న వారంతా తిరిగి హైదరాబాద్​ బాట పట్టారు. హైదరాబాదులో ఉంటున్న ఏపీకి చెందిన వారంతా సంక్రాంతి పండుగకు తరలివచ్చారు. పండుగ అనంతరం తిరిగి హైదరాబాదుకు బయలుదేరి వెళ్తున్నారు. దీంతో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి.

సందడిగా ముగిసిన సంక్రాంతి వేడుకలు - అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు

కార్లు బైకులు ఇతర వాహనాలపై తరలి వెళ్తున్నారు. కంచికచర్ల మండలం కీసర టోల్​గేట్​ వద్ద వాహనాలు ఒక్కొక్కటిగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. నందిగామలోని వై జంక్షన్ వద్ద వెహికల్ అండర్ పాస్ వంతెనకు అనుసంధానంగా రహదారులు నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణ పనుల వలన సర్వీస్ రోడ్ నుంచి హైదరాబాద్ వైపు వాహనాలు పంపిస్తున్నారు. సర్వీస్ రోడ్డు మొత్తం గుంతల పడి అధ్వానంగా ఉండటంతో వాహనాలు వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉంది. దీనివల్ల కార్లు ముందుకు వెళ్లడం కష్టంగా ఉంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా తరలి వెళ్తున్నాయి.

సంక్రాంతి రిటర్న్ జర్నీ ఎఫెక్ట్ - ప్రయాణ ప్రాంగణాలు కిటకిట

452 రకాలు - కొత్త అల్లుడికి అదిరిపోయే సంక్రాంతి విందు

ABOUT THE AUTHOR

...view details