Ruling opposition party Leaders' campaign: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ప్రచారంలో రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. తమకే ఓటు వేయాలంటూ కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకుంటూ, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. మరోవైపు వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు పెరిగాయి.
విధ్వంసం చేయడమే జగన్ అజెండా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలోని శ్రీచక్ర అపార్ట్ మెంట్ వాసులతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని, రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్ అజెండా అని లోకేశ్ విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిచేందుకు కృషి చేస్తానన్నారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డికి చేదు అనుభవం: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తాడేపల్లిలోని అపార్ట్‌మెంట్ వాసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. నియోజకవర్గ అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలిసి ప్రచారానికి వెళ్లిన ఆర్కే ను సొంత పార్టీ సానుభూతిపరులే నిలదీశారు. రాజధాని విషయంలో తాము తీవ్రంగా నష్టపోయామని ఆళ్లకు వివరించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం గుణదలలో తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విస్తృత పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలో సమస్యలన్నీ పరిష్కరిస్తామని నేతలు హామీ ఇచ్చారు.
వైసీపీ కొనసాగుతున్న షాక్‌ల పర్వం- ఫ్యాన్‌ను వీడి సైకిల్ ఎక్కుతున్న నేతలు - YSRCP Leaders Join In To TDP