ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి - 8మందికి తీవ్ర గాయాలు

Road Accident Some Districts in Andhra Pradesh: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు సమీపంలోని జాతీయ రహదారిపై అర్థరాత్రి ఓ కారుని, మినీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడికే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించారు.

Road Accident Some Districts in Andhra Pradesh
Road Accident Some Districts in Andhra Pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 20, 2024, 1:40 PM IST

Road Accident Some Districts in Andhra Pradesh: కర్నూలు జిల్లా సల్కాపురం సమీపంలోని జాతీయ రహదారిపై అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నాగలాపురం నుంచి కర్నూలుకి వస్తుండగా ఓ కారుని, మినీ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడిక్కడికే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నాగులాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అరకులోయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - మూడు బైకులు ఢీకొని నలుగురు మృతి

Car Collided With Bullock Cart One Person Dead:శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలోని కొట్నూరులో అర్థరాత్రి సమయంలో ఎద్దుల బండిని పెనుకొండ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు సమీపంలో ఉన్న విద్యుత్​ నియంత్రికకు తగిలి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండిపై ఉన్న నాగేంద్ర, సునీల్, బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వీరంతా భోజనం చేసి నిలిపి ఉంచిన ఎద్దుల బండిపై సేద తీరుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులోని వారు ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. విద్యుత్​ నియంత్రికను కారు ఢీకొనడంతో గ్రామంలో అంధకారం నెలకొంది. ఈ సంఘటనపై హిందూపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కారు ఓ వైసీపీ నాయకుడికి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి- ఇంకొకరికి తీవ్ర గాయాలు

Road Accident in East Godavari District: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల జాతీయ రహదారిపై నిమ్మకాయల యార్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి చెందిన మారంపల్లి ప్రసాద్‌ పెయింటింగ్‌ పనులు చేస్తుంటాడు. భార్య మానస బధిరురాలు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు ఇంద్ర మెకానిక్‌ పనులు చేస్తుంటాడు. రెండో కుమారుడు సుకేశ్‌ (18) క్యాటరింగ్‌కు వెళ్లటంతోపాటు ఏసీ మరమ్మతులు చేస్తుంటాడు.

రాజమహేంద్రవరంలో ఏసీ పని ఉందని సుకేశ్‌ అదే గ్రామానికి చెందిన మిత్రులతో కలిసి ద్విచక్ర వాహనంపై మంగళవారం ఉదయం బయలుదేరారు. అయితే వీరి ద్విచక్ర వాహనం వేగంగా విభాగినిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుకేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సుకేశ్​ మిత్రులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహన ప్రమాదంలో చిన్న కుమారుడు చనిపోవడంతో ఆ ఇంట తీరని విషాదం నెలకొంది. ఈ ఘటనపై నల్లజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్​ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా 9మంది మృతి

ABOUT THE AUTHOR

...view details