ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్టీఆర్​ జిల్లాలో స్కూల్ బస్సు-బైక్​ ఢీ - ఒకరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు - TODAY ACCIDENTS IN AP - TODAY ACCIDENTS IN AP

Road Accidents in NTR District One Die Three injured : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీ కొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

road_accidents_in_ntr_district_one_die_three_injured
road_accidents_in_ntr_district_one_die_three_injured

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 22, 2024, 12:35 PM IST

Road Accidents in NTR District One Die Three injured : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చందర్లపాడు మండలం కోనాయిపాలెం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన స్కూల్ బస్సు ఢీ కొంది. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Car Hits Auto in Prakasam District :ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం, పూసలపాడు వద్ద రోడ్డు ప్రమాదం, ఆటోను వెనక నుంచి ఢీ కొట్టిన కారు, ఆటోలో ప్రయాణిస్తున్న 12 మందికి తీవ్ర గాయాలు కాగా వారిని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం తరలించారు. క్షతగాత్రులు మొత్తం మార్కాపురానికి చెందిన వారుగా గుర్తించినట్లు సమాచారం. వీరు గిద్దలూరు మండలం తంబళ్లపల్లిలో పెళ్లికి హాజరై తిరిగి మార్కాపురం వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం - అక్కడికక్కడే ఐదుగురు మృతి - FIVE PEOPLE DIED IN ROAD ACCIDENT

Road Accidents In Andhra Pradesh :శుభకార్యానికి వెళ్లొస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై దువ్వాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజువాక సమీప శ్రామికనగర్​లో నివాసం ఉంటున్న రామలక్ష్మి (47), తన భర్త తాతయ్య నాయుడుతో కలిసి చోడవరం సమీపంలోని బుచ్చెయ్యపేటలో జరిగిన బంధువుల ఇంట్లో వివాహానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరిగి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. అగనంపూడి సమీప డెంకాడ కాలనీ వద్దకు వచ్చేసరికి వెనక నుంచి వచ్చి లారీ బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. రామలక్ష్మి తూలి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై ఘటనాస్థలిలోనే మృతి చెందారు. భర్త తాతయ్యనాయుడుకు బలమైన గాయాలయ్యాయి. ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. రామలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్​కు తరలించారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి - ఇద్దరికి గాయాలు - Two Persons Dead in Car Accident

ABOUT THE AUTHOR

...view details