Rice Rates Heavy in AP: బియ్యం ధరలు వింటేనే భయం వేస్తోంది. భవిష్యత్తులో బియ్యం కొనగలమా అనే సందేహం సామాన్యుల్ని వెంటాడుతోంది. ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నా నియంత్రించే నాథుడే రాష్ట్రంలో కరవయ్యాడు. ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కారు కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. వర్షాల్లేక ఈ ఏడాది వరి సాగు తగ్గడం మరింత కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి తమ బాధలు చూడాలని సామాన్యులు వేడుకుంటున్నారు.
ఆరు నెలల్లోనే అమాంతం: రాష్ట్రంలో గడిచిన నెల వ్యవధిలో బియ్యం ధరలు (Rice Price) భారీగా పెరిగాయి. మధ్య తరగతి, ఆపై వర్గాల వారు సన్న బియ్యం తినడానికి మొగ్గు చూపుతున్నారు. వెరైటీని బట్టి 26 కేజీల బస్తా 14 వందల రూపాయల నుంచి 17వందల రూపాయల వరకు ఉంది. ఆరు నెలల్లోనే బియ్యం ధరలు (25kg rice price in andhra pradesh) పెద్దఎత్తున పెరిగిపోయాయి.
వైఎస్సార్సీపీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి : దేవినేని ఉమా
ధరలను నియంత్రించని అధికారులు : ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది, జీఎస్టీ పరిధిలో ఉన్న హోల్‌సేల్ డీలర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను విచ్చలవిడిగా పెంచుతున్నా పౌర సరఫరాల అధికారులు నియంత్రించలేకపోతున్నారు. సన్నరకం, హెచ్ఎంటీ, సూపర్ ఫైన్ రకాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.
రేషన్ బియ్యం అనువుగా లేవని సన్నబియ్యానికే మొగ్గు : ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం తినడానికి అనువుగా లేక చాలా మంది బహిరంగ మార్కెట్లోకి అమ్మేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని కేజీ 15 రూపాయల నుంచి 18 రూపాయలకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరంతా సన్నబియ్యం వైపే మొగ్గుచూడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతోంది.