రాష్ట్రంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా -వైసీపీకి ప్రచారం చేసేందుకేనా రాజీనామా! Resignation of volunteers in AP : రాష్ట్రంలో వాలంటీర్ల రాజీనామా పర్వం జోరుగా కొనసాగుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదని ఎన్నికల సంఘం విధిస్తున్న ఆంక్షలతో నేరుగా రాజీనామాలకే వాలంటీర్లు సిద్ధమయ్యారు. మరి కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలే బలవంతంగా రాజీనామాలు చేయించి ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు.
YSR District :వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని చెన్నమరాజుపల్లె పంచాయతీలో 14 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకొంటున్నట్లు కార్యదర్శి కిరణ్‌కు పంపిన రాజీనామా పత్రాల్లో వారు పేర్కొన్నారు. ముద్దనూరు మండలంలో 45 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను ఎంపీడీఓ చంద్రమౌళికి అందజేశారు.
వాలంటీర్ల జీవితాలతో ఎమ్మెల్యే ఆడుకుంటున్నారు : టీడీపీ నేత చింతకాయల విజయ్ - TDP Leader Vijay
Anakapalli : అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న 15 మంది వాలంటీర్లను ఎన్నికల సంఘం విధుల నుంచి తొలగించింది. నర్సీపట్నం పురపాలక సంఘంలో పలువురు వాలంటీర్లు బుధవారం బృందాలుగా వచ్చి కమిషనర్ పూడి రవిబాబుకు రాజీనామా పత్రాలను అందజేశారు. ఒకే నమూనాలో వీరంతా రాజీనామా కారణాలను పేర్కొన్నారు.
Guntur : గుంటూరు జిల్లాలో తాడేపల్లి, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు మండలాలకు చెందిన 126 మంది వాలంటీర్లు బుధవారం మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. తాడేపల్లిలో వైసీపీకి పట్టున్న ప్రాంతంలోని వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి ప్రచారం చేయటం కోసమే రాజీనామాలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
'రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి'- ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - TDP Leaders Election Campaign In AP
Manyam :మన్యం జిల్లా భామిని మండలం బత్తిలిలో 30 మంది స్వచ్ఛంద సేవకులు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతికి వారి రాజీనామా పత్రాలు అందజేశారు. సచివాలయంలో అందజేయాల్సిన రాజీనామా పత్రాలను ఎమ్మెల్యేకు ఇవ్వటంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వీరఘట్టం మండలంలో బుధవారం వాలంటీర్ల రాజీనామాల హైడ్రామా జరిగింది. మండల పరిషత్ వైసీపీ ప్రధాన నాయకుడి స్వగ్రామంలో తొమ్మిది మంది వాలంటీర్లు రాజీనామా చేశారంటూ విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి పత్రాలు అందజేశారని తెలిసింది.
ర్యాలీలు, రోడ్‌షోలు, సమావేశాలతో ఎన్నికల ప్రచారం - గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల వ్యూహం - AP Election Campaign