Remand Prisoner Died in Vijayawada Sub Jail : విజయవాడ సబ్ జైలులో తిలక్ అనే రిమాండ్ ఖైదీ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడిన తిలక్ జిల్లా జైలుకు వెళ్లిన తెల్లారే శవమై తేలాడు. ఖైదీ మృతిపైబంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ మార్చురీలో తిలక్ మృతదేహాన్ని పరిశీలించారు. అనారోగ్య కారణాలతోనే చనిపోయాడని ప్రాథమికంగా భావిస్తున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
తల్లి కోసం తల్లడిల్లిపోయిన చిన్నారి - జైలు వద్ద వెక్కివెక్కి ఏడుస్తూ ఎదురుచూపులు
విజయవాడ వన్ టౌన్ గొల్లగట్టు ప్రాంతానికి చెందిన బాలగంగాధర్ తిలక్ ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఈనెల 5న డ్రంకన్ డ్రైవ్‌లో తిలక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డాడు. తిలక్‌ను ఈనెల 7న కోర్టులో హాజరుపర్చిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ నుంచి జిల్లా జైలుకు తరలించారు. తిలక్ అనారోగ్యంతో మృతి చెందాడని పోలీసులు చెప్పారని కుటుంబసభ్యులు అంటున్నారు. జైలుకు వెళ్లే సమయంలో తమ కుమారుడి ఆరోగ్యం బాగానే ఉందని జైల్లో ఏదో జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Suspicious Death News in Vijayawada Sub Jail : ప్రభుత్వ ఆసుపత్రిలో తిలక్‌కు వైద్యం చేసిన డాక్టర్లు, జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన అధికారుల వివరాలను అందించాలని పోలీసులు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో తిలక్ పోలీసులకు పట్టుబడ్డ అనంతరం నిందితుడికి రైల్వే కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. తరువాత కోర్టు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కు తరలించారు. అక్కడ నుంచి జిల్లా జైలుకు తరలించారు. ఏమైందో ఏమో హఠాత్తుగా తిలక్ కుటుంబసభ్యులకు ఈరోజు ఉదయం ఏడు గంటల సమయంలో జైలు సిబ్బంది ఫోన్ చేసి తిలక్ మృతి చెందినట్లు తెలిపారు.