Balakrishna 108 Feet Cutout Record :విజయవాడలోని బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగులతో ఏర్పాటు చేసిన గేమ్ ఛేెంజర్ భారీ కటౌట్ ఎంతో ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే దీనికన్నా ముందే 80వ దశకంలోనే దేశంలోనే అతిపెద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసి బెజవాడ వార్తల్లో నిలిచింది. సినిమాలన్నా, అభిమాన నటులన్నా ప్రాణాలిచ్చే విజయవాడ వాసులు 1986లో నందమూరి బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు చిత్రం విడుదల సందర్భంగా 108 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
అలంకార్ ధియేటర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భారీ కటౌట్ చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చేవారు. ఆ రోజుల్లోనే రూ.80వేలతో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఏర్పాటు చేసిన గేమ్ ఛేంజర్ కటౌట్ ముందు వరకు బాలకృష్ణ కటౌటే అతిపెద్దగా రికార్డు ఉంది.
Ram Charan 256 Feet Cut Out :మరోవైపు రామ్‌చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది. నిర్మాత దిల్ రాజు రికార్డు సంస్థ ప్రతినిధుల నుంచి అవార్డును అందుకున్నారు. ఆదివారం సాయంత్రం ఈ కటౌట్‌ను దిల్‌రాజు ఆవిష్కరించారు. హెలికాప్టర్ ద్వారా దీనిపై పూల వర్షం కురిపించారు. సినిమాలో రామ్‌చరణ్ నట విశ్వరూపాన్ని చూస్తారని తెలిపారు. జనవరి 4 లేదా 5 తేదీల్లో లో సినిమాకు సంబంధించిన భారీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని ఆయన చెప్పారు.