Gas Cylinder Blast Case in Rayachoti : అనుమానం పెనుభూతమై ఎన్నో కుటుంబాల్లో చిచ్చు రాజేస్తుంది. పచ్చని కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఫలితంగా దంపతుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. ఒక్కొసారి వారిలో ఎవరి ఒకరో చావడం లేదా చంపడమో జరుగుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రాయచోటిలో సిలిండర్ పేలి తల్లి, ఇద్దరు పిల్లలు మరణించిన కేసులో మిస్టరీ వీడింది.
Police Solved Gas Cylinder Blast Case :లక్కిరెడ్డిపల్లెకు చెందిన రాజాకు, దానంరెడ్డిగారిపల్లెకు చెందిన రమాదేవితో పదేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. అబ్బాయి మనోహర్‌కు తొమ్మిదేళ్లు, అమ్మాయి మాన్వితకు ఐదేళ్లు. ఐదు సంవత్సరాల క్రితం దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లారు. రెండేళ్ల క్రితం రమాదేవి.,తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని రాయచోటికి వచ్చింది! టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
కువైట్‌లోనే ఉన్న రాజా తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లోకి ఎవరు వచ్చివెళ్తున్నారో దుబాయ్ నుంచే తెలుసుకునేందుకు రాయచోటిలో భార్య ఉండే ఇంటి బయట, బెడ్ రూం, వంటగదిలో సీసీ కెమెరాలు పెట్టించాడు. కెమెరాను తన మొబైల్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకున్నాడు. ఇంటికి ఎవరు వచ్చి వెళ్లినా రమాదేవికి ఫోన్‌చేసి సూటిపోటి మాటలతో కాల్చుకుతినేవాడు. శుక్రవారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఫోన్‌లో వాగ్వాదం జరిగింది.