ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసు - పోలీసుల అదుపులో కోటిరెడ్డి - PERNI NANI RATION RICE CASE

పేర్ని నాని గోదాములో బియ్యం మాయం కేసులో పోలీసుల ముమ్మర దర్యాప్తు

Perni Nani Ration Rice Case
Perni Nani Ration Rice Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 30, 2024, 1:03 PM IST

Perni Nani Ration Rice Case :కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబానికి చెందిన జేఎస్ గోదాములో దాదాపు 7700 బస్తాల రేషన్ బియ్యం మాయమైన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బియ్యం మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కృష్ణా జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డినే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పేర్ని నాని గోదాములో పీడీఎస్ బియ్యం మాయంపై ఇటీవలే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే బియ్యం నిల్వల మాయం విషయంలో తనపై అనుమానం రాకుండా కోటిరెడ్డి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఆదివారం నాడు గోదాము మేనేజర్ మానస తేజ్​ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెన్నైలోని ఓ ప్రాంతంలో ఆయన్ను పోలీసులు వలపన్ని పట్టుకొని మచిలీపట్నం తరలించి విచారిస్తున్నట్లు సమాచారం.

ఈ కేసులో పేర్ని నాని భార్యను మొదటి నిందితురాలిగా, గోదాముల మేనేజరు మానసతేజ్​ని రెండో నిందితుడిగా పోలీసులు చేర్చారు. త్వరలోనే మానసతేజ్​, కోటిరెడ్డి అరెస్ట్ చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న ఇద్దర్ని బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఆరు నెలలుగా తనకు ఆరోగ్యం బాగోకపోవడంతో మేనేజర్​గా మానసతేజ్‌ని నియమించామని జేఎస్ యజమాని అధికారులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

PDS Rice scam in AP :కానీ పోలీసులు విచారణలో రెండేళ్లుగా ఆయన మేనేజరుగా కొనసాగుతూ బిల్లులు రూపొందిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అసలు బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు మానస్​తేజ్​ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈకేసులోపేర్ని నాని భార్య పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ కేసు ఇవాళ విచారణకు రానుంది. మచిలీపట్నం జిల్లా కోర్టులో ఈ విచారణ జరగనుంది.

పేర్ని నానికి ఇకపై నిద్రలేని రాత్రులే - తలకిందులుగా తపస్సు చేసినా తప్పించుకోలేరు : మంత్రి కొల్లు రవీంద్ర

బ్లాక్​ లిస్టులోకి పేర్ని నాని గోడౌన్​! - రేషన్‌ బియ్యం మచిలీపట్నం తరలింపు

ABOUT THE AUTHOR

...view details