తెలంగాణ

telangana

ETV Bharat / state

బాపట్ల జిల్లాలో దారుణం - మైనర్​ బాలికపై గ్యాంగ్​ రేప్ - MINOR GIRL RAPED IN AP - MINOR GIRL RAPED IN AP

MINOR GIRL RAPED IN AP : మహిళలు, చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట లైంగిక దాడులు, అత్యాచారానికి పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Rape on Minor Girl in Nizampatnam
MINOR GIRL RAPED IN AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 10:29 PM IST

Rape on Minor Girl in Nizampatnam :సమాజంలో రోజురోజుకూ మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా మహిళలపై కొందరు మృగాళ్లలా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. వావి-వరసలు మరచి అత్యాచారాలకు తెగబడుతున్నారు. తమ కామవాంఛతో ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఆడవారు పట్టపగలు ఒంటరిగా బయటకు రావాలన్నా జంకుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎంత కఠినంగా శిక్షించినా, కీచకుల ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు అత్యాచారం- వెలుగులోకి ఓ కానిస్టేబుల్ నిర్వాకం - constable traps girl and raped

Rape Cases in Andhra Pradesh : తాజాగా ఓ మైనర్​ బాలికపై ఐదుగురు యువకులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది. ఈఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక శుక్రవారం నాడు నిజాంపట్నం మండలంలోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. శుక్రవారం రాత్రి పరిచయం ఉన్న యువకులు, మాట్లాడే పని ఉందని చెప్పి ఆ అమ్మాయిని బయటకు పిలిచారు. అక్కడి నుంచి గ్రామ శివారు తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

రాత్రి 10 గంటల తర్వాత ఇంటికి వచ్చిన మైనర్ బాలికను మేనమామ గట్టిగా నిలదీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయిపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించామని వారు పేర్కొన్నారు.

ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురు యువకుల్లో ఇద్దరితో మైనర్​ బాలికకు ఇంతకుముందే పరిచయం ఉందని పోలీసులు వివరించారు. వారంతా బాధితురాలి స్వగ్రామానికి చెందిన వారని చెప్పారు. ఇందులో ఒకరు మైనర్ ఉన్నట్లు పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం ఆ అమ్మాయిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెపై ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

తల్లిదండ్రులు తిట్టారని ఇంటినుంచి బయటకొచ్చిన మైనర్ - మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన రాపిడో డ్రైవర్ - Girl Raped by Rapido Driver in ts

"చిన్నారిపై హత్యాచారం దురదృష్టకరం - ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితునికి శిక్ష విధిస్తాం" - PEDDAPALLI MINOR RAPE CASE

ABOUT THE AUTHOR

...view details