ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 4:34 PM IST

ETV Bharat / state

మరమ్మతుల పేరుతో ముసివేత - ఆరు నెలలైనా తెరుచుకోని బస్టాండ్​ - Rajvihar Junction Bus Stand

Rajvihar Junction Bus Stand Closed six months ago for repairs : వైఎస్సార్సీపీ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి రాజ్ విహార్ బస్టాండ్‌ మూసేసి ప్రయాణికులకు నిలువ నీడ లేకుండా చేశారని వారు ధ్వజమెత్తారు. అధికారులు బస్టాండ్​కు పూర్వవైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలు డిమాండ్​ చేస్తున్నారు.

rajvihar_junction_bus_stand_closed_six_months_ago_for_repairs
rajvihar_junction_bus_stand_closed_six_months_ago_for_repairs (ETV Bharat)

మరమ్మతుల పేరుతో ముసివేత - ఆరు నెలలైనా తెరుచుకోని బస్టాండ్​ (ETV Bharat)

Rajvihar Junction Bus Stand Closed Six Months Ago for Repairs :వివిధ ప్రాంతాలకు వెళ్లే వందలాది బస్సులు ఆ మార్గం మీదుగానే వెళ్తుంటాయి. కానీ గతంలో అక్కడ ఏర్పాటు చేసిన బస్టాండు మూతపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు నగరంలో ఎన్నో ఏళ్లుగా సేవలందించిన రాజ్‌విహార్‌ బస్టాండ్‌ను మరమ్మతుల పేరుతో మూసేశారు. నెలలు గడుస్తున్నా పనులు మాత్రం ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి.

సరిగ్గా ఎన్నికల కోడ్​ అమలు ముందు పని ప్రారంభించినట్టు చేసి, ఎందరికో నీడనిచ్చే బస్టాండ్​ను మరమ్మతుల పేరుతో మూసేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక ప్రజలు అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార నేతల మాటలు కోటలు దాటినా పని మాత్రం జరగడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

'కర్నూలులోని రాజ్‌విహార్‌ కూడలిలో ఉన్న బస్టాండు. మరమ్మతుల పేరుతో ఆరు నెలల క్రితం మూసేశారు. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులన్నీ రాజ్‌ విహార్‌ మీదుగానే వెళ్తుంటాయి. బస్టాండు లేకుండా చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్​కు ముందే ఆగిపోయిన పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు, స్థానికులకు చాలా ఇబ్బందికరంగా ఉంది.'- ప్రయాణికులు

ఓటర్లతో రద్దీగా ఒంగోలు బస్టాండ్ - ఆర్టీసీపై ప్రయాణికుల ఆగ్రహం - VOTERS PROBLEMS DUE TO NO BUSES

Passengers Problems :రాజ్ విహార్ బస్టాండ్‌లో మరమ్మతుల పేరుతో ఆరు నెలల క్రితం పనులు ప్రారంభించారు. పాడైపోయిన రోడ్డును తొలగించి కొత్త రోడ్డు వేసే పనులు మొదలయ్యాయి. రాజ్ విహార్ బస్టాప్ లోపలికి రాకుండా బయటి నుంచే వెళ్లేలా దారి మళ్లించారు. ఫలితంగా వచ్చే బస్సులన్నీ రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీనివల్ల ప్రయాణికులు కూడా రోడ్డుపైనే బస్సుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఓ వైపు ఎండలు, అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండటంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు బస్సులన్నీ ప్రధాన రహదారిపై అడ్డంగా ఆపుతుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలిగి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే రాజ్‌విహార్‌ బస్టాండు మరమ్మతులు పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కోడ్​ను ఉల్లంఘించిన దేవినేని అవినాష్ - ప్రభుత్వ ఆస్తులపై వైసీపీ బ్యానర్లు, జెండాలు - ycp code violation in vijayawada

ABOUT THE AUTHOR

...view details