Problems of TIDCO Houses Residents: పేదవాడి ఇంటి కలను నెరవేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వం పల్నాడు జిల్లా నరసరావుపేటలో 15 వందల 4 టిడ్కో గృహాలను నిర్మించింది. వైఎస్సార్సీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లు ఈ ఇళ్లను పట్టించుకోకుండా పక్కన పెట్టేసింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా టిడ్కో ఇళ్లను వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు.
ఆయా ఇళ్లల్లో లబ్ధిదారులు ఉండేందుకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఆర్భాటంగా ప్రచారం మాత్రం చేసుకున్నారు. నాలుగేళ్లు అద్దె ఇంట్లో అవస్థలు పడిన లబ్ధిదారులు సొంతింటి స్వప్నం సాకారమైందని మురిసిపోయారు. ఎన్నో ఆశలతో టిడ్కో ఇళ్లలోకి అడుగుపెట్టిన లబ్ధిదారులకు అసలు కష్టాలు మొదలయ్యాయి. కనీస మౌలిక వసతులు లేక పడరాని పాట్లు పడుతున్నారు.
దాదాపు 7, 8 నెలలుగా ఇక్కడ నివాసం ఉంటున్నా మున్సిపాలిటీ సిబ్బంది టిడ్కో ఇళ్ల నుంచి చెత్త తీసుకెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు తెలిపారు. సమస్యను ఎమ్మెల్యే అరవిందబాబు దృష్టికి తీసుకెళ్తే వెంటనే చెత్త డబ్బాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టారని వివరించారు. సిబ్బందికి చెప్పి వీధి కుక్కల సమస్య కూడా తీర్చారనన్నారు. డ్రైనేజీతో పాటు సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా మున్సిపాలిటీ సిబ్బంది మాత్రం సరిగా స్పందించడం లేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖజానా ఊడ్చేసింది - ఏ పని చేయాలన్నా రూపాయి లేదు: మంత్రి నారాయణ - NARAYANA ON TIDCO HOUSES
నరసరావుపేట టిడ్కో గృహ సముదాయంలో సుమారు 450 ఇళ్లకు సంబంధించి రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆ లబ్ధిదారుల పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం బ్యాంకు రుణాలు తీసుకుందని లబ్ధిదారులు అంటున్నారు. టీడీపీ హయాంలో సిద్ధం చేసిన లబ్ధిదారుల జాబితాలో వైఎస్సార్సీపీ సర్కార్ మార్పులు చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఇళ్లు కేటాయించిందని ఆరోపించారు. దాదాపు 400 మంది అర్హులను తొలగించారని తెలిపారు. వారంతా హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వులతో కొన్ని ఇళ్ల పంపిణీ నిలిపేశారన్నారు. టిడ్కో ఇళ్ల జాబితాలోని అవకతవకల విషయం కూటమి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే అరవిందబాబు హామీ ఇచ్చారు.
"మేము ఇక్కడ టిడ్కో ఇళ్లలో ఉంటున్నాము. దాదాపు వంద కుటుంబాలు ఇక్కడ సంవత్సరం నుంచి ఉంటున్నాయి. ఇక్కడ రోడ్డు దగ్గర లైట్లు లేవు. మహిళలు అక్కడ నుంచి రాత్రి సమయంలో రావాలంటే కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి వసతులు లేవు. చెత్త పేరుకుపోతోంది. వర్షాలు పడితే బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాము. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు మా ఒక్కొక్క సమస్యా చెప్పుకుంటున్నాము. ఆయన వాటిని పరిష్కరిస్తున్నారు". - లబ్ధిదారులు
టిడ్కో ఇళ్లను పట్టించుకోని వైఎస్సార్సీపీ పాలకులు - కూటమి ప్రభుత్వం రాకతో లబ్ధిదారుల్లో ఆశలు - tidco houses in ap