Priests Dispute in Talakona Shiva Temple in Tirupati District : తిరుపతి జిల్లా తలకోన శివాలయంలో ఇద్దరు అర్చకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఆలయ అర్చకులు శివప్రసన్నశర్మ, ప్రసాద్ శర్మ భక్తులు చూస్తుండగానే ఘర్షణకు దిగారు. శివప్రసన్నశర్మ కుమారుడు మనోజ్‌కు సహాయక అర్చక పదవీ విషయంలో వివాదం జరిగింది. శివప్రసన్న శర్మ తన కుమారుడిని సహాయ అర్చకునిగా నియమించే ప్రతిపాదనలకు సంబంధించి ప్రసాద్ శర్మతో ప్రస్తావించకపోవడం వివాదానికి దారి తీసింది.
నియామక ప్రతిపాదన పత్రాలపై తనతో సంప్రదించకుండా శివప్రసన్న శర్మ తన సంతకం చేశారని ప్రసాద్ శర్మ ఆరోపించడంతో గొడవకు దారి తీసింది. ఇటీవల శివప్రసన్న శర్మ తనయుడు మనోజ్ ను తలకోన ఆలయంలో సహయక అర్చకుడిగా నియమించారు. ఈ నేపథ్యంలో అర్చకుల మధ్య వివాదం కొనసాగుతోంది. అర్చకులు ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్న దృశ్యాలు ఆలయ సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి.