తెలంగాణ

telangana

ETV Bharat / state

తొక్కిసలాట నుంచి ఇలా తప్పించుకోవాలి - చిన్న ట్రిక్​ పాటిస్తే చాలు లైఫ్ సేఫ్ - PRECAUTIONS DURING STAMPEDE

తొక్కిసలాట, చుట్టూ జనం ఉన్నారా? - ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి

Precautions in Telugu that Should be Taken During Stampede
Precautions in Telugu that Should be Taken During Stampede (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 16, 2025, 4:58 PM IST

Precautions in Telugu that Should be Taken During Stampede :సంధ్య థియేటర్, ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగన ఘటనల్లో కొంత మంది మరణించగా, మరికొంతమంది ప్రాణాలపైకి వచ్చింది. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులే ఎక్కువగా బాధితులవుతుంటారు. ప్రస్తుతం ప్రయాగ్​రాజ్​లో మహా కుంభమేళా జరుగుతోంది. అక్కడికి వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తొక్కిసలాట క్షేమంగా బయటపడవచ్చని నిమ్స్​ కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్​ సాయిసతీష్ ఓరుగంటి చెబుతున్నారు.

'పుష్ప' తీసిన ప్రాణం : సంధ్య థియేటర్​కు అల్లుఅర్జున్ - తొక్కిసలాటలో మహిళ మృతి

  • ఏదైనా ఒక ప్రదేశంలో ఎక్కువ జనం పొగైనప్పుడు గుంపు మధ్యలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. బయటకు వచ్చేయడానికి ప్రయత్నించాలి.
  • తొక్కిసలాట జరిగన సందర్భంలో బొర్లా లేదా వెళ్లకిలా పడిపోతే ఆ హడావుడిలో జనం తొక్కుకుంటూ వెళ్లిపోతుంటారు. దీంతో చాతిపై భారం పడి రిబ్స్​ విరిగిపోయి ఊపిరితిత్తులు, గుండెకు గాయలవుతాయి. కొన్నిసార్లు అంతర్గతంగా రక్తస్రావం జరిగి మృతి చెందుతారు.
  • ముడుచుకుని పడుకోవాలి : మరికొందరికి ఊపిరి తీసుకోవడానికి వీలుకాక మెదడుకు ఆక్సిజన్ ఆగిపోయి మెదడుకు గాయాలవుతాయి. ఒకవేళ కిందపడిపోతే పక్కకు తిరిగి ముడుచుకుని పడుకోవడానికి ప్రయత్నించాలి. పిల్లలు మీతోపాటు ఉంటే వారికి పొత్తి కడుపులో పెట్టుకోని పడుకోవాలి. అలా చేయడం వల్ల మీతోపాటు పిల్లలకు ఊపిరితిత్తులు, గుండెకు గాయాలు అవ్వకుండా కాపాడుకోవచ్చు.
  • గుంపులో ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నట్లు అనిపిసితే వెంటనే నిల్చునే తీరు మార్చాలి. రెండు కాళ్లు కొంచెం దూరం పెట్టి చేతుల పిడికిళ్లి బిగించి గుండె వద్ద పెట్టుకుని బాక్సింగ్ భంగిమలో నిల్చోవడం ద్వారా తొందరగా ముందుకు పడిపోయే పరిస్థితి ఉండదు. తమను తాము రక్షించుకోవచ్చు. గుంపునకు ఎదురుగా కాకుండా గుంపు ఎటువైపు వెళ్తే అటువైపు వెళ్లడం వల్ల కింద పడిపోవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది.
  • కార్డియోపల్మనరీ రిససిటేషన్, మౌత్​ బ్రీతింగ్ తదితర ప్రాథమిక చికిత్స పద్ధతులపై సాముహికంగ ప్రజలకు శిక్షణ ఇవ్వడం మంచిది. దీంతో ఇలాంటి తొక్కిసలాట సమయంలో ఊపిరి ఆగిపోయిన వారికి సీపీఆర్ చేస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది.

తిరుపతిలో తొక్కిసలాట - ఆరుగురు భక్తుల మృతి

ABOUT THE AUTHOR

...view details