Prathidhwani On Buy Gold In Current Conditions Or Not :మనదేశంలో బంగారానికి, ప్రజలకు మధ్య ఉన్న అనుబంధమే వేరు. ఎన్ని తరాలు గడిచినా దానిపై ఉన్న ప్రేమ తరగదు. పసిడికాంతులీనడం ఆగదు. సందర్భం ఏదైనా పెళ్లిళ్లు, శుభకార్యాలు అనగానే గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయిందీ లోహం. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం కూడా. అందుకే దాని ధరల్లో వచ్చే ప్రతిచిన్న చిన్నమార్పును ఎప్పటికప్పుడు తెలుసుకుంటారంతా. ఆ మార్పులకు కారణాలు రానున్న రోజుల్లో దాని ప్రభావాలు ఎలా ఉంటాయో అంచనాకు రావడం అవసరం. ఇప్పుడు కూడా తగ్గిన ధరల్లో బంగారం కొనాలా? ఆగాలా? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఇంకా తగ్గుతాయా? పెరుగుతాయా? మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఏం చేస్తే మేలు? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో పాల్కొంటున్న వారు విశాఖ బులియన్ మార్కెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఏ శ్రీనివాసరావు. ఆర్సీపీ టెక్నాలజీస్, స్టాక్‌మార్కెట్ విశ్లేషకులు సుందర్ రామిరెడ్డి.
అంతా పండగల సీజనే : ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కొంతకాలంగా రికార్డు స్థాయి గరిష్ఠాల్లో ఉన్న బంగారం ధరల్లో ఇటీవల కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ బంగారం ధరలు చూస్తున్న తర్వాత ఇప్పుడు చాలామందిలో బంగారం ఇప్పుడు కొనాలా? ఆగాలా? బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులకు ఇది అనువైన సమయమేనా అని తర్జనభర్జన పడుతున్నారని వెల్లడించారు. ఇప్పటి నుంచి మరికొన్ని నెలలు వరకూ అంతా పండగల సీజనే ఉంది. పండగల నుంచి పెళ్లిళ్లు, వేడుకల సందర్భాలకి ప్రతిఒక్కరు ఎంతోకొంత గోల్డ్ కొనాలి అనుకుంటారని వివరించారు. అసలు బంగారం ధరలను ఏఏ అంశాలు ప్రభావితం చేస్తాయో ప్రజలు తెలుసుకోవాలన్నారు.