ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల లడ్డూ వివాదం - వైరల్​ అవుతున్న ప్రకాష్​రాజ్​ వరుస పోస్టులు - Prakash Raj vs Pawan Kalyan

Prakash Raj vs Pawan Kalyan Tweets War: సామాజిక మాధ్యమం ఎక్స్‌(X) వేదికగా సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. తిరుమల లడ్డూ వివాదంపై హీరో కార్తి, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన వివాదం సద్దుమణిగింది అనుకునేలోపే ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ చర్చకు లేవనెత్తినట్లు అవుతుంది. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎలా స్పందిస్తారో?

prakash_raj_vs_pawan_kalyan
prakash_raj_vs_pawan_kalyan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2024, 7:32 PM IST

Updated : Sep 25, 2024, 10:28 PM IST

Prakash Raj vs Pawan Kalyan Tweets War:సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్ సామాజిక మాధ్యమం ఎక్స్‌(X) వేదికగా చేస్తున్న పోస్టులు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్​ను ట్యాగ్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ప్రకాశ్​ రాజ్ తెలుగులో మరో పోస్ట్‌ పెట్టారు. "‘చేయని తప్పునకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్‌ ఆస్కింగ్‌" అని పేర్కొన్నారు.

ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రకాశ్‌ రాజ్‌ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నితమైన అంశాలపై ప్రకాశ్‌ రాజ్‌ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ప్రకాశ్‌రాజ్‌ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని అన్నారు. ఎవరైనా సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్‌ హెచ్చరించారు.

దీనిపై ప్రకాశ్‌ రాజ్ స్పందిస్తూ మరో ట్వీట్ చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో సినిమా షూటింగ్​లో ఉన్నానని ఇండియాకు వచ్చాక పవన్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్‌ చేశారు. అందులో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ "పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నా. ఈ నెల 30వ తేదీ తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి" అని పేర్కొన్నారు.

పవన్‌ కల్యాణ్ ఎలా స్పందిస్తారో: ఇటీవల జరిగిన సత్యం సుందరం సినిమా ఈవెంట్‌లో 'లడ్డూ అంశం ప్రస్తుతం సున్నితమైంది' అని కార్తీ నవ్వుతూ చెప్పడంపైన కూడా పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవిత్రమైన విషయాలను అపహాస్యం చేసేలా మాట్లాడొద్దని అనడంతో కార్తి క్షమాపణ చెప్పారు. దానికి పవన్‌ కల్యాణ్ బదులిస్తూ, కార్తి కావాలని అనలేదని అర్థమైంది అని తెలపడంతో అక్కడికి ఈ వివాదం సద్దుమణిగింది. కార్తి క్షమాపణ చెప్పిన అంశంపై ఇప్పుడు ప్రకాశ్‌రాజ్ చేసిన పోస్ట్‌ చూస్తే మళ్లీ చర్చకు లేవనెత్తినట్లు అర్థమవుతోంది. మరి దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

సనాతన ధర్మం జోలికొస్తే ఊరుకునేది లేదు : పవన్ కల్యాణ్ - Pawan Kalyan Visits Indrakeeladri

టీటీడీని పొలిటికల్ చేశారు- వీఐపీ టిక్కెట్లు అమ్ముకున్నారు: చంద్రబాబు - CM Chandrababu Naidu on Tirumala

Last Updated : Sep 25, 2024, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details