Jubilee Hills Hit and Run Case Update: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు మరో షాక్ తగిలింది. రెండు సంవత్సరాల క్రితం జూబ్లీహిల్స్ కేసులో మధ్యంతర బెయిల్‌ను పొందగా దాన్ని రద్దు చేయాలని కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది పంజాగుట్ట బారికేడ్లను ఢీకొన్న కేసులో రాహిల్ దుబాయ్ నుంచి వచ్చి ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనను విచారిస్తున్న క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాహిల్‌ను ఈ కేసులో నిందితుడిగా గుర్తించారు.
EX MLA Shakeel Son Rahil Case :జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఓ చిన్నారి మృతి చెందగా కారు ప్రమాదానికి కారణమైన ముగ్గురు పారిపోయారు. అందులో రాహిల్ కూడా ఉన్నాడు. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటం తరువాత తానే వాహనాన్ని నడిపినట్లు ఓ వ్యక్తి లొంగిపోయాడు. అయితే ఈ కేసులో తనపై కఠిన చర్యలు తీసుకోకుండా అదేశించాంటూ రాహిల్ హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిలు పొందాడు.
గతేడాది ప్రజాభవన్ వద్ద బారికేడ్లు ఢీ కొన్న ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ కేసు గురించి తెలిసి దీన్ని పునఃప్రారంభించారు. ఈ కేసులో పోలీసులు లొంగిపోయిన వ్యక్తి వాంగ్మూలం తీసుకున్నారు. అందులో ప్రమాదం జరిగినప్పుడు కారు నడిపింది రాహిల్ అని తెలిసింది. రాహిల్ బంధువులు తానే కారు నడిపినట్లు అంగీకరించాలంటూ బలవంతంగా ఒప్పించారని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో నిందితుడికి ఇచ్చిన బెయిలును రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం హైకోర్టు ఉత్తర్వులు వెలువరించనుంది.