Namburu Woman Murder Case : ఆ మహిళ అతని భార్య కాదు! కానీ తనకే ఆమె సొంతం కావాలనుకున్నాడు. ఆ మహిళ మాత్రం వివాహేతర సంబంధాన్ని మధ్యలో తెంచేసుకుంది. దీంతో అతడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా వశపరుచుకోవాలనుకున్నాడు. చివరకు భూత వైద్యుడికి రూ.3 లక్షల సుపారీ ఇచ్చి వశీకరణం చేయించాడు. అయినా వాళ్ల పాచికలు పారలేదు. చివరకు ఆమెను అంతమొందించాడు. కటకటాలపాలయ్యాడు.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో గత నెల 28న మల్లిక అనే మహిళ హత్యకు గురైంది. మెడపై గాయం ఉండడంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. తీగలాగితే పోలీసులే విస్తుపోయే క్రైం కథ బయటికొచ్చింది. మల్లికకు నంబూరుకు చెందిన అక్బర్‌తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం పుట్టాక ఆమె అక్బర్‌ను, పిల్లల్ని వదిలేసి నంబూరుకే చెందిన ప్రేమ్‌కుమార్‌తో అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఏడేళ్లు గుంటూరులో కాపురం చేసింది.
ఈ క్రమంలోనే 2021లో రెహమాన్ అనే మరో వ్యక్తితో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతని వద్ద బంగారం, డబ్బు కలిపి రూ.15 లక్షల వరకూ గుంజింది. కొంతకాలానికి నంబూరుకు చెందిన నాగబాబు అనే మరో వ్యక్తితో సహజీవనం చేసింది. ఇక్కడే రెహమాన్‌కు కోపం వచ్చింది. ఆమె తనకు మాత్రమే సొంతం కావాలనుకున్నాడు. మల్లిక మాత్రం పాస్ట్ ఈజ్ పాస్ట్ మళ్లీ నా గడప తొక్కొద్దంటూ తలుపులు మూసేసింది.