ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈ పోలీసులేంటీ ఇలా అయిపోయారు బ్రో! ఐదుగురిని సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - AP Police Corruptions - AP POLICE CORRUPTIONS

AP Police Irregulaties: కంచే చేను మేసినట్లు పోలీసులే అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బు కోసం కక్కుర్తి పడి ఉన్నతాధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. దొంగ నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తులో కొంత నొక్కేశారు. అదో సామెతలా దొంగతనం దాగదు అన్నట్లు ఈ పోలీసుల చిలక్కొట్టుడు సంగతి కాస్త ఆలస్యంగా బయటపడింది. దీంతో ఒకేసారి ఐదుగురు సస్పెండ్ అయ్యారు.

AP Police Corruptions
AP Police Corruptions (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 9:21 PM IST

AP Police Corruptions : పోలీస్ శాఖలో ఎప్పుడూ లేని సంస్కృతి పురుడుపోసుకుందనే ఆనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. అన్యాయాన్ని అరికట్టాల్సిన 'రక్షక భటులే భక్షక భటులుగా' బాధితులను కాల్చుకు తింటున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సొమ్ముకు కక్కుర్తి పడి తమ స్థాయిని, బాధ్యత మరిచి లంచానికి సలాం కొడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కంచే చేను మేసినట్లు, అవినీతిపరుల ఆటకట్టించాల్సిన పోలీసులే అడ్డదారుల తొక్కడం విమర్శలకు దారితీస్తోంది. రాష్ట్రంలో తాజాగా వెలుగు చూసిన రెండు ఘటనలు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పోగొట్టేలా ఉన్నాయి.

మేము స్వాధీనం చేసుకుంది 18 లక్షల 52 వేలే : చోరీ కేసులో చేతివాటం ప్రదర్శించిన ఐదు మంది పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ఈ నెల 17వ తేదీన తెలంగాణ నుంచి 300 బస్తాల మిర్చిని తీసుకుని డ్రైవర్‌, క్లీనర్‌ ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లాడు. మిర్చి విక్రయించగా వచ్చిన డబ్బును తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. కొంత దూరం వచ్చిన తర్వాత డ్రైవర్‌ను ఏమార్చిన క్లీనర్‌ ఆ డబ్బుతో పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద లారీ క్లీనర్‌ను అరెస్టు చేశారు.

సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం - డిప్యూటీ సర్వేయర్​ సస్పెన్షన్​ - Bribe for Chandrababu house

ఈ ఘటనలో పోలీసులు చేతివాటం ప్రదర్శించి పట్టుకున్న డబ్బుల్లో 6 లక్షల రూపాయలు కాజేశారు. 18 లక్షల 52 వేల రూపాయలను లారీ క్లీనర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులో చూపించారు. అయితే, వాస్తవంగా చోరీకి గురైన డబ్బు రూ.25 లక్షలు అని బాధితులు వాపోయారు. దీనిపై ఆరోపణ రావడంతో విచారణ చేసిన ఏసీపీ రవి కుమార్‌ ఏ.ఆర్ ఏఎస్సై రుద్రరాజు, హెడ్ కానిస్టేబుల్ నాగబాబు, కానిస్టేబుల్ అరుణ్ కుమార్, శివ, సృజన్‌లు డబ్బులు స్వాహా చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. కమిషనర్‌కు నివేదిక పంపిచి సంబంధిత ఐదుగురు పోలీసులను విధుల నుండి సస్పెండ్ చేశారు.

సీజ్ చేసిన బైక్ విడిభాగాలు కొట్టేసే యత్నం : శ్రీ సత్య సాయి జిల్లా ఆగలి మండలంలోని మరో పోలీస్ నిర్వాకం బయపడింది. వివరాల్లోకి వెళ్తే, నందరాజునపల్లి గ్రామంలో నాలుగు నెలల క్రితం మహేష్, దినేష్ అనే ఇద్దరి పురోహితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారి ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్​కు తరలించారు. స్టేషన్​లో మూలన ఉన్న ద్విచక్ర వాహనంపై రామాంజనేయులు అనే పోలీసు అధికారి కన్ను పడింది. అంతే వాహనాన్ని మెకానిక్ షాప్​కు తీసుకెళ్లి విడిభాగాలను తొలగించేందుకు యత్నించాడు. అదే సమయంలో మహేష్ మెకానిక్ షాపు వద్దకు వెళ్లి వీడియో తీస్తూ పోలీసును నిలదీశాడు. కంగుతిన్న పోలీస్ రామాంజనేయులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్​ వద్ద మహేష్, దినేష్​లు ఆవేదన వ్యక్తం చేశారు.

ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఇలాంటి పరిస్థితి రావటం బాధాకరం- సార్​ మారండి: జేసీ ప్రభాకర్ రెడ్డి - JC Prabhakar Comments On IPS

కోట్లు కొల్లగొట్టారు - జల్సాలు చేశారు - అన్నాచెల్లెళ్లా మజాకా - Brother and Sister Frauds

ABOUT THE AUTHOR

...view details