ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం - విశాఖలో నగదుతో పట్టుబడ్డ వైవీ ప్రైవేట్​ కార్యదర్శి - srikakulam Police Checking Vehicles - SRIKAKULAM POLICE CHECKING VEHICLES

Police Checking Vehicles due to Elections: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులతో పాటు అధికారులలో సైతం అలజడి మెుదలైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్న అధికారులు వాటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికలు సజావుగా జరగటానికి ఎక్కడ కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, మద్యం ఇతరత్రా తరలించే వారిపై పోలీసులు నిఘా పెంచారు. దీనికోసం అన్ని జిల్లాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.

Police_Checking_Vehicles_due_to_Elections
Police_Checking_Vehicles_due_to_Elections

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 5:37 PM IST

Updated : Apr 10, 2024, 7:45 PM IST

Police Checking Vehicles due to Elections: రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ వైపు పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేశాయి. కొన్ని పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు తాయిలాలు (Gifts) పంచే ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల అధికార పార్టీకి చెందిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్​ చేశారు. మరోవైపు చెక్​పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలుపెంచాయి. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, గంజాయి పట్టుబడుతోంది.

తనిఖీల్లో పట్టుబడిన నగదు, బంగారం, ఆభరణాలు స్వాధీనం చేసుకున్న అధికారులు రసీదు ఇస్తారు. మరుసటి రోజు నిర్వహించే విచారణలో నగదుకు సంబంధించిన అధికారిక పత్రాలను పోలీసులకు అందజేస్తే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వాటిని తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే చెక్ పోస్టుల ద్వారా ఎక్కడికక్కడ నిఘాను ఉద్ధృతం చేశామని సమస్యాత్మక గ్రామాల్లో అదనపు బలగాలను ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులువెల్లడించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో కచ్చితంగా పాటించాలనే ఆదేశాలను ఇప్పటికే జారీ చేశారు.

విశాఖలో ఎంవీపీ కాలనీ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రైవేటు కార్యదర్శి దశరథరామిరెడ్డి రూ. 6 లక్షల నగదుతో చిక్కారు. ఇంటి కొనుగోలు కోసం తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును ఎంవీపీ పోలీసులకు అప్పగించారు.

ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరం - విశాఖలో నగదుతో పట్టుబడ్డ వైవీ ప్రైవేట్​ కార్యదర్శి

వెంకటగిరి సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద తనిఖీలు ముమ్మరం

Srikakulam Money Seized in Police Checkings: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరం వద్ద ఎటువంటి పత్రాలు లేని నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెక్​పోస్టు వద్ద వాహనాల తనిఖీలో 6 లక్షల 75 వేల రుపాయలు పట్టుబడ్డాయి. ఈ నగదుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో సదరు వ్యక్తి నుంచి పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. అనపర్తి నుంచి కోటబోమ్మాళికి నగదు తీసుకువెళ్తునట్లు ఈ వ్యక్తి తెలిపాడని పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన నగదుకు సంబంధించి ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఆర్వోకు నగదును అందజేసినట్టు పోలీసులు వెల్లడించారు.

Flying Squad In Kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీల్లో రూ.37 లక్షలు పట్టుబడ్డాయి. సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్నారు.

గరికపాడు చెక్​పోస్టు వద్ద అధికారుల తనిఖీలు

Police Seized Ganja At Visakhapatnam:విశాఖ జిల్లా అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద పోలీసుల తనిఖీల్లో 14 కేజీల గంజాయి పట్టుబడింది. నర్సీపట్నం- విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఉన్న గంజాయిని పోలీసులు గుర్తించారు. 14 కేజీల చొప్పున రెండు బస్తాల గంజాయి తరలిస్తున్న దంపతులను దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఏం ఐడియా సామీ - ప్లాస్టర్ సాయంతో గంజాయి దేహానికి అతికించుకుని - Police Seized 22 kilos Ganja

Last Updated : Apr 10, 2024, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details