ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్త హత్య - తానే కత్తి అందించిన భార్య - హత్య కేసు చేధించిన పోలీసులు

Police Chase Death Case Mystery in Nellore District : నెల్లూరు రెండో పట్టణ పరిధిలోని రామచంద్రాపురం వద్ద ఈ నెల 18న జరిగిన మాడుపూరు పెంచల ప్రసాద్(35) హత్య కేసును పోలీసులు చేధించారు. సీసీ పుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంతో నేరస్థులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో సంచలనమైన వివరాలు వెలుగులోకి వచ్చాయి.

police_chase_death_case_mystery_in_nellore_district
police_chase_death_case_mystery_in_nellore_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 10:53 PM IST

Police Chase Death Case Mystery in Nellore District : నెల్లూరు రెండో పట్టణ పరిధిలోని రామచంద్రాపురం వద్ద ఈ నెల 18న జరిగిన మాడుపూరు పెంచల ప్రసాద్(35) హత్య కేసును పోలీసులు ఛేదించారు. సీసీ పుటేజ్, ఫోన్ కాల్స్ ఆధారంతో నేరస్థులను గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. భార్య సహకారంతో 8 మంది హత్యలో పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తేలడం అందర్నీ విస్తుగొలిపిస్తోంది. భర్తను హత్య చేస్తున్నప్పుడు తన నోట్లో గుడ్డలు కుక్కినట్లు నాటకమాడి, అమాయకురాలిగా చలామనీ అయినా పట్టుమని పది రోజులు కాకముందే పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబెడుతోంది.

విజయనగరం జిల్లాలో దారుణం - తల్లిదండ్రులను చంపిన కుమారుడు

Unknown Persons Killed a Man in Nellore Andhra Pradesh :గుర్తు తెలియని వ్యక్తులు భార్య కళ్ల ముందే తన భర్తను అతి కిరాతకంగా పొడిచి చంపిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ప్రసాద్ భార్య నోట్లో గుడ్డలు కుక్కి గుర్తు తెలియని యువకులు ఆమె ఎదుటే తన భర్తను చిత్రహింసలకు గురిచేసి హత మార్చినట్లు చిత్రించిన విషయం విదితమే. ఈ కేసులో మృతుడి శరీరంపై దాదాపు 25 పైగా కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

భార్యపై అనుమానం- నోట్లో కరెంట్​ వైర్​ పెట్టి హత్య చేసిన భర్త

Police Chase Death Case Mystery :మృతుడు పెంచలప్రసాద్ భార్య అతడి మేనకోడలు. పెంచల ప్రసాద్​ భార్యకు ఫోన్​ ద్వారా అతడి మిత్రుడు సాగర్​తో పరిచయం ఏర్పడింది. దాంతో రోజురోజుకీ వారిరువురి మధ్య సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది. ఒక రోజు ప్రసాద్​ భార్య తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలను సాగర్​తో పంచుకుంది. దీంతో అప్పుడప్పుడు సాగర్​ కొన్ని విషయాలను ప్రసాద్​ వద్ద ప్రస్తావించి అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పేవాడు. ఈ విషయంలో సాగర్, ప్రసాద్​ల మధ్య వివాదాలు జరిగాయి. పాత కక్షలు, అతని భార్యతో వివాహేతర బంధం నేపథ్యంలో ప్రసాద్​ను ఎలాగైనా కడతేర్చాలని పథకం పన్నాడు. దొపిడీ దొంగలు ఈ ఘతుకానికి పాల్పడినట్లు సీన్​ క్రియేట్​ చేశారు. అందులో భాగంగానే తన నోట్లో గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడినట్లు ప్రసాద్​ భార్య తెలిపింది.

భర్త హత్యకు కత్తి అందించిన భార్య- 25 కత్తి పోట్లతో మృతి- చేధించిన పోలీసులు

సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకుని విచారించి కేసును ఛేదించినట్టు దర్యాప్తు బృందం పేర్కొంది. వివాహేతర సంబంధం కారణంగానే పథకం ప్రకారం ప్రసాద్​ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు అందరూ 19, 21 సంవత్సరాల మధ్య వయస్కులే. ప్రసాద్​ను పొడిచి చంపేందుకు అతడి భార్యే కత్తి కూడా అందించిందని పోలీసుల విచారణలో తేలినట్టు తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేని కేసును ఆధారాలతో సహా సేకరించి నిందితులను అరెస్ట్​ చేసిన పోలీస్​ టీమ్​ను ఎస్పీ అభినందించారు.

వదినను హతమార్చి ఆత్మహత్యాయత్నం- వివాహేతర సంబంధమే కారణమా?

ABOUT THE AUTHOR

...view details