ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

ETV Bharat / state

చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యాప్తిపై పోలీసుల నిఘా - ఆ వీడియోలు చూస్తే అరెస్టే! - Pocso Cases in AP

Pocso Cases in Telugu States : చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్​లోడ్​ చేసి చూసినా, వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్కపెట్టాడానికి సిద్ధంగా ఉండాల్సిందే. సాంకేతిక ఆధారాలతో పోలీసులు కనిపెడుతున్నారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష విధించనున్నారు.

Pocso Cases Increasing in Hyderabad
Pocso Cases Increasing in Hyderabad (ETV Bharat)

Pocso Cases in Telugu States :చిన్నారులతో చిత్రీకరించిన అశ్లీల వీడియోలు డౌన్​లోడ్​ చేసి చూసినా, వ్యాప్తి చేసినా ఇక జైల్లో ఊచలు లెక్కపెట్టడానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇది సర్వోన్నత న్యాయస్థానం తీర్పు. ఫోన్​, కంప్యూటర్​లో గుట్టుగా చూస్తే ఎవరూ గుర్తించరు అనుకోవద్దు. సాంకేతిక ఆధారాలతో పోలీసులు కనిపెట్టేస్తున్నారు. వాట్సాప్​ గ్రూపులు, ఫేస్​బుక్​ ఇన్​స్టాగ్రామ్​లో ఇతరులకు పంపిస్తున్నట్లు వెలుగు చూస్తుండటంతో వాటి నియంత్రణపై తెలంగాణలోని రాచకొండ పోలీసులు దృష్టి సారించారు.

హైదరాబాద్​ కమిషనరేట్​లో ఈ ఏడాది ఆగస్టు వరకు 520 పోక్సో కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసుల్లో అరెస్టయ్యే నిందితుల్లో ఎక్కువ మందిపై అశ్లీల వీడియోల ప్రభావం ఉన్నట్లు తేలింది. ఇలాంటి కేసుల్లో అభియోగాలు నిరూపితమైతే ఐదు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశముంటుంది.

అశ్లీల వీడియోలకు బానిసగా మారిన ఓ వ్యక్తి అందులో ఉన్నట్లుగా చేయాలని తన 13 ఏళ్ల కూతురిపై కన్నేశాడు. అతడి చేష్టలను బాలిక తిరస్కరించింది. దీంతో ఆ బాలిక ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంలో బండరాయితో కొట్టి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేశాడు. సరిగ్గా చదువుకోవడం లేదని మందలించినందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

'తల్లిదండ్రులూ' తస్మాత్​ జాగ్రత్త - పక్కనే మృగాళ్లున్నారు!! - POCSO Act

కన్నేసిన అమెరికా :మన దేశంపై ఇక్కడి పోలీసులే కాదు, విదేశీ దర్యాప్తు సంస్థలు కూడా కన్నేశాయి. చైల్డ్​ పోర్నోగ్రఫీ వ్యాప్తి చేస్తున్న వారిపై దృష్టి సారించాయి. అమెరికాలోని హోంల్యాండ్​ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్​, నేషనల్​ సెంటర్​ ఫర్​ మిస్సింగ్​ అండ్​ ఎక్స్​ప్లాయిటెడ్​ చిల్డ్రన్స్​ తదితర సంస్థలు ఐపీ అడ్రస్​లను కేంద్ర హోంశాఖకు పంపిస్తున్నాయి. అలా వచ్చిన సమాచారంతో గతేడాది ఒక యువకుడిని సైబర్​ పోలీసులు అరెస్టు చేశారు.

చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని రాచకొండ కమిషనర్​ సుధీర్​బాబు తెలిపారు. చిన్నారుల అశ్లీల దృశ్యాలు చూసినా, సామాజిక మాధ్యమాల్లో ఇతరులకు పంపినా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష పడుతుందన్నారు. చిన్నారులను మానవ మృగాల నుంచి కాపాడుకుని నేరరహిత సమాజంలో భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు.

పిల్లల పోర్న్ వీడియోలు డౌన్​లోడ్​ చేయడం, చూడడం నేరమే: సుప్రీం కోర్ట్ - SC Verdict On Child Pornography

మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన - వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌ - Former YCP Mla Sudhakar Arrest

ABOUT THE AUTHOR

...view details