CM Chandrababu on Pensions: పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1వ తేదీనే 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతోనే పింఛన్లను పెంచి అందజేస్తున్నామని తెలిపారు.
64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో పింఛన్లు అందించిన సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం 12 వేల 508 కోట్లు ఖర్చు చేసిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానన్నారు.
పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. 1వ తేదీనే 98 శాతం మంది లబ్దిదారులు ఇంటి వద్దనే పింఛను అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చింది. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో పింఛన్లు పెంచి అందజేస్తున్నాం. 64.38 లక్షల మందికి పింఛను… pic.twitter.com/RjYg4Wz7h8
— N Chandrababu Naidu (@ncbn) October 1, 2024
October Month Pension Distribution: ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. సచివాలయ సిబ్బంది తెల్లవారుజాము నుంచే వేగంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. రికార్డు స్థాయిలో 98 శాతం మందికి ఒక్కరోజులోనే పింఛన్ల పంపిణీ పూర్తి అయింది. నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఇంటివద్దకే తెచ్చి పింఛన్లు పంపిణీ చేయడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నానికే 95 శాతం పూర్తి: రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 2.30 గంటలకు 95.20 శాతం మేర పెన్షన్ల పంపిణీ పూర్తి అయింది. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పెన్షన్ అందజేశారు. విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97 శాతం మందికి పైగా పెన్షన్ల అందజేశారు. తిరుపతి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 96 శాతానికి పైగా అందించారు. నెల్లూరు, అనకాపల్లి, కడప, బాపట్ల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. 2,721 కోట్లకు గాను ఇప్పటి వరకు 2589 కోట్లను పింఛను రూపంలో లబ్ధిదారులకు అందజేశారు.