Phone Tapping Case Latest Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీపై నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నకు నాంపల్లి కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీకి అనుమతిచ్చింది. ప్రణీత్‌రావును 5 రోజుల పోలీస్ కస్టడీ కోరగా, పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసులో నిందితుడు ప్రణీత్‌రావు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావును ఓసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు, కీలక వివరాలను రాబట్టారు. నిందితులందరినీ ఒకేసారి ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని భావించిన పోలీసులు, కస్టడీ కోసం పిటిషన్ వేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు - భుజంగరావు, తిరుపతన్నల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి - phone tapping case latest updates - PHONE TAPPING CASE LATEST UPDATES
Phone Tapping Case Latest Updates : ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, సీఐ గట్టు మల్లును విచారిస్తున్నారు. గతంలో ఎస్‌ఐబీలో గట్టుమల్లు సీఐగా పనిచేశారు. ప్రణీత్‌రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నారు. మరోవైపు భుజంగరావు, తిరుపతన్నలను 5రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది.
Published : Mar 28, 2024, 9:30 PM IST
Court Allows to Bhujangarao Custody :రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న రాత్రి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరికి ప్రణీత్‌తో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఈ కేసులో ఇప్పటికే రాజకీయ పార్టీలు నిష్పక్షపాత దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. పాత్రధారులతో పాటు సూత్రధారులను కూడా అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి.